Gas Cylinder : గ్యాస్ సిలిండర్ బుకింగ్ లో కొత్త నిబంధనలు… దీని వల్ల లాభాలేంటి…
ప్రధానాంశాలు:
Gas Cylinder : గ్యాస్ సిలిండర్ బుకింగ్ లో కొత్త నిబంధనలు... దీని వల్ల లాభాలేంటి...
Gas Cylinder : పూర్వం భారతదేశంలో దాదాపుగా ప్రతి ఒక్కరి పేద మరియు మధ్యతరగతి ఇండ్లల్లో కట్టెల పొయ్యి మీదే వంటలు చేసేవారు. అలాగే దాని పొగా కారణంగా ఆ ఇంటిలోని ఆడపిల్లలకు తమ ఆరోగ్యం పూర్తిగా పాడయ్యేది.ఈ పరిస్థితి ఎంతో తీవ్రంగా ఉండేది. ఈ కారణం చేతే ujjawal పథకం కింద భారతదేశంలోని ప్రతి ఒక్క మహిళకు గ్యాస్ కనెక్షన్ అందించే పథకాన్ని అమలు చేశారు నరేంద్ర మోడీ గారు.ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలిసినదే. అయితే ప్రస్తుతం ఈ పథకం కింద దేశంలోని ప్రతి మూలన ఉన్న కోట్లాది ఇండ్లు ఇప్పటికే గ్యాస్ కనెక్షన్ పథకం యొక్క ప్రయోజనాలను పొందారు…
నిరుపేద కుటుంబాల కోసం అమలు చేసినటువంటి ఈ పథకం కింద ప్రస్తుతం అనర్హులు అయినటువంటి వారు కూడా ఈ సదుపాయాన్ని పొందుతున్నారు అని ప్రభుత్వ దృష్టికి చేరింది. ఈ కారణం తోనే ఈ అన్యాయాన్ని అరికట్టడానికి ప్రభుత్వం కొత్త నిబంధలను అమలు చేస్తుంది. అయితే క్యూఆర్ స్కాన్ కోడ్ ను వాడాలి అని ఏజెంట్లకు చెప్పటం జరిగింది. దీంతో ప్రభుత్వం ప్రతి సమాచారాన్ని కూడా ట్రాక్ చేస్తుంది. ఇది ఒక ఆధార్ కార్డు లాగా పనిచేస్తుంది అన్నమాట. అలాగే ఇకమీదట ప్రభుత్వం ఎటువంటి అవకతవకలు మరియు అక్రమాలను కూడా గుర్తించటం ఎంతో సులభం అవుతుంది. ఈ కొత్త
నిబంధనల వలన కలిగే ప్రయోజనాలు ఏమిటి
ఈ ఉజ్వల గ్యాస్ పథకం కింద అందుబాటులో ఉన్నటువంటి సిలిండర్లను మీరు ఎన్నిసార్లు వాడారో ఈజీగా తెలుస్తోంది. అలాగే ఎల్పిజి సిలిండర్ దొంగతనాన్ని కూడా పూర్తిగా నియంత్రించవచ్చు. అయితే ఈ QR స్కాన్ కోడ్ నుండి ట్రాకింగ్ కూడా ముందు రోజులలో ఇంకా సులభం అవుతుంది. దీంతో మీరు ఏ డీలర్ నుండి సిలిండర్ ను పొందుతున్నారో కూడా తెలుస్తుంది. అయితే గృహ,వాణిజ ప్రయోజనాల కోసం వాడే గ్యాస్ సిలిండర్లు సరిగ్గా క్రమబద్ధీకరించబడుతుంది. అలాగే మీకు గ్యాస్ ఎందుకు వచ్చింది అనే విషయం కూడా తెలుసుకోవచ్చు. అయితే అనర్హులు అయినటువంటి వారికి ఈ తరహా గ్యాస్ కనెక్షన్ అనేది రాకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ కొత్త టెక్నాలజీని ప్రారంభించింది. ఇప్పటి నుండి ఈ ఉజ్వల గ్యాస్ పథకం కింద ఎలాంటి అన్యాయాలు జరగకుండా ఉంటాయి…