బాబు సొంత ఊరిలో చెవిరెడ్డి ఘనకార్యం మెచ్చుకోవాల్సిందే..
Chevireddy Bhaskar Reddy : సొంత గ్రామం అంటే ఎవరికైనా సాధారణంగా అభిమానం ఉంటుంది. అందుకు ఎవరు అతీతులు కారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఆయన గ్రామం అంటే వల్లమాలిన ప్రేమ.. అవసరం ఉన్న లేకున్నా ప్రతి ఇంటికి లక్షలు లక్షలు పంచిపెట్టిన చరిత్ర ఆయనకు ఉంది. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సొంత గ్రామం నారావారి పల్లె విషయంలో మాత్రం బాబు పెద్దగా ఆసక్తి చూపించడు అంటూ వైసీపీ నేతలు అనేక సార్లు చెపుతుంటారు. అయితే విచిత్రంగా ఆ వూరు జనాలు మాత్రం బాబును విపరీతంగా ఆదరిస్తూనే ఉంటారు.
ఇక అసలు విషయానికి వస్తే కరోనా తీవ్రతరం కావటంతో ప్రతిచోటా ఆక్సిజన్ బెడ్స్ కొరత ఎక్కువగా ఉంది. ఇలాంటి సమయంలో చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి chevireddy bhaskar reddy నియోజకవర్గమైన చంద్రగిరి లో 100 అలాగే బాబు స్వస్థలం నారావారిపల్లె ప్రభుత్వాస్పత్రిలో 50 చొప్పున 150 ఆక్సిజన్ పడకలను సొంత ఖర్చులతో ఏర్పాటు చేయడం విశేషం. ఇందుకు చెవిరెడ్డి రూ.25 లక్షలు సొంత నిధులు ఖర్చు చేశారు. చంద్రగిరి, నారావారిపల్లె ప్రభుత్వాస్పత్రులను సందర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
chevireddy bhaskar reddy : చంద్రగిరి లో 500 పడకలతో మరో కొవిడ్ కేర్ సెంటర్
చంద్రగిరి పరిధిలోని పద్మావతి కొవిడ్ కేంద్రంలో ఇప్పటికే వెయ్యి మంది కరోనా బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. చంద్రగిరి సమీపంలో 500 పడకలతో మరో కొవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటు చేస్తామన్నారు. చంద్రగిరి, నారావారిపల్లె ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కొనుగోలు కోసం రూ.25 లక్షలు సొంత డబ్బు ఖర్చు చేస్తున్నట్టు తెలిపారు. అలాగే హోం ఐసొలేషన్‌లో ఉన్నవారికి 34 రకాల వస్తువులతో 2,500 కిట్లు ముందస్తుగా సిద్ధం చేశామని చెప్పారు.
నిత్యం చంద్రబాబు మీద విమర్శలు చేస్తూనే మరోపక్క కష్ట కాలంలో బాబు సొంత గ్రామం అనే వివక్ష లేకుండా chevireddy bhaskar reddy వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి నారావారి పల్లె లో ఇలాంటి కార్యక్రమం చేయటం పట్ల సర్వత్రా ప్రశంసలు లభిస్తున్నాయి.