Chia Seeds vs Pumpkin Seeds | చియా vs గుమ్మడి గింజలు ఏవి బెస్ట్? .. నిపుణుల సూచన ఏంటి?
Chia Seeds vs Pumpkin Seeds | ఈ మధ్యకాలంలో ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన బాగా పెరిగింది. ఫిట్‌నెస్, బరువు తగ్గడం, హార్ట్ హెల్త్, జీర్ణక్రియ వంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండే వారి సంఖ్య పెరిగింది. ఈ క్రమంలో చియా సీడ్స్, గుమ్మడి గింజలు ఆరోగ్యానికి మేలు చేసే సూపర్ ఫుడ్స్‌గా పేరొందాయి. అయితే ఈ రెండింటిలో ఏది మెరుగైనదో అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. అందుకే వీటి ప్రత్యేకతలను, ప్రయోజనాలను నిపుణుల అభిప్రాయాలతో ఇప్పుడు చూద్దాం.
#image_title
చియా సీడ్స్ ప్రయోజనాలు:
ఫైబర్ పుష్కలంగా: చియా గింజల్లో గుమ్మడి గింజల కంటే ఐదు రెట్లు ఎక్కువ ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా బరువు నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తుంది.
ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్: గుండె ఆరోగ్యం, మెదడు పనితీరు కోసం ఇవి అవసరం. చియా గింజలు ఇవి అందించే ఉత్తమ వనరు.
క్యాల్షియం అధికంగా: ఎముకలు, దంతాల ఆరోగ్యానికి తోడ్పడుతుంది.
బ్లడ్ షుగర్ కంట్రోల్: గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిని సమతుల్యం చేస్తుంది.
గుమ్మడి గింజల లాభాలు:
ప్రోటీన్ అధికం: కండరాల నిర్మాణం, శరీర కణాల మరమ్మత్తుకు అవసరమైన ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది.
మెగ్నీషియం శాతం ఎక్కువ: నరాల ఆరోగ్యం, మంచి నిద్ర, రక్తపోటు నియంత్రణకు ఉపయోగపడుతుంది.
విటమిన్ E: శరీరంలో ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది.
ఆరోగ్యకరమైన కొవ్వులు: గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
నిపుణుల ప్రకారం, రెండింటినీ సమతులితంగా తీసుకోవడం ఉత్తమం. ఒక్కదానికే పరిమితం కాకుండా, చియా గింజల ద్వారా ఫైబర్, ఒమేగా-3లను; గుమ్మడి గింజల ద్వారా ప్రోటీన్, మెగ్నీషియాన్ని పొందవచ్చు.