Chicken Dum Biryani : డబల్ మసాలా చికెన్ దమ్ బిర్యాని… ఇంట్లోనే ఎంతో ఈజీగా చేసుకోవచ్చు… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Chicken Dum Biryani : డబల్ మసాలా చికెన్ దమ్ బిర్యాని… ఇంట్లోనే ఎంతో ఈజీగా చేసుకోవచ్చు…

 Authored By aruna | The Telugu News | Updated on :24 September 2022,4:00 pm

Chicken Dum Biryani : నాన్ వెజ్ ప్రియులు చికెన్ అంటే అందరూ ఎంతో ఇష్టంగా తింటుంటారు. ఆ చికెన్ ఎన్నో వెరైటీస్ గా చేస్తూ ఉంటారు. అయితే ఆ చికెన్ తో రెస్టారెంట్ స్టైల్ లో డబల్ మసాలా చికెన్ దమ్ బిర్యాని ఇంట్లోనే ఎంతో ఈజీగా తయారు చేసుకోవడం ఎలాగో ఇప్పుడు మనం చూద్దాం…

కావలసిన పదార్థాలు : చికెన్, బ్రౌన్ ఆనియన్, కొత్తిమీర, పుదీనా, నల్లయాలకులు, సాజీర, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, అల్లం వెల్లుల్లి పేస్ట్, బిర్యానీ ఆకులు, మరాఠీ మొగ్గ, కారం, జీలకర్ర పొడి, ధనియా పౌడర్ యాలకుల పొడి, ఉప్పు, నిమ్మరసం, గరం మసాలా, పసుపు, పెరుగు, ఆయిల్, బాస్మతి బియ్యం, ఫ్రెష్ క్రీమ్, పచ్చిమిర్చి నెయ్యి, నీళ్లు కుంకుమపువ్వు మొదలైనవి… తయారీ విధానం : మందపాటి గిన్నెను తీసుకొని దాన్లో కొంచెం సాజీర, 8 యాలకులు, ఎనిమిది లవంగాలు, ఒకటి దాల్చిన చెక్క నల్ల యాలకులు, జాపత్రి ఒక కప్పు పుదీనా, ఒక కప్పు కొత్తిమీర, ఒక కప్పు పెరుగు, కొంచెం ఉప్పు, కొంచెం కారం, జీలకర్ర పొడి, ధనియా పొడి, యాలకుల పొడి, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా నిమ్మరసం, వేసి బాగా పిసుకుతూ కలుపుకోవాలి. తర్వాత దానిలో ఫేస్ క్రీమ్ కూడా వేసి కలుపుకోవాలి, ఇక తర్వాత చికెన్ వేసి తర్వాత కొద్దిగా నూనెను కూడా వేసుకోనీ బాగా కలిపి నైట్ మొత్తం ఫ్రిజ్లో ఉంచుకోవాలి.

Double Masala Chicken Dum Biryani is very easy to make at home

Double Masala Chicken Dum Biryani is very easy to make at home…

తర్వాత బాస్మతి రైస్ ని రెండు కప్పులు తీసుకొని శుభ్రంగా కడిగి ఒక గంట వరకు నానబెట్టుకోవాలి. తర్వాత స్టౌ పై బాండీ పెట్టి దానిలో వాటర్ పోసి ఆ వాటర్ లో సాజీర, నల్ల యాలకులు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, ఒక బిర్యానీ ఆకు, జాపత్రి కొద్దిగా ,పుదీనా కొద్దిగా, కొత్తిమీర వేసి ఆ నీళ్ళని బాగా మసలనివ్వాలి. తర్వాత ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని దానిలో వేసి, దాంట్లో నాలుగైదు పచ్చిమిర్చి వేసుకొని 70% ఉడకనిచ్చి దాన్లో వేసరని తీసి మనం నైట్ మొత్తం నానబెట్టుకున్న చికెన్ లో కూడా వేసుకొని దానిని స్టవ్ పైన పెట్టి 70% ఉడికిన అన్నాన్ని తీసి లేయర్ లేయర్లుగా చల్లుకోవాలి. తర్వాత దానిపైన కొద్దిగా కొత్తిమీర, కొంచెం పుదీనా, బ్రౌన్ ఆనియన్, కొద్దిగా నెయ్యి, ఒక గిన్నె నూనె, కుంకుమపువ్వుని పాలలో కలిపి దానిని కూడా వేసి దానిపైన కొద్దిగా ఎసర పోసుకొని గోధుమ పిండితో చుట్టూ లేయర్ గా ఆవిరిపోకుండా పెట్టి గట్టిగా మొదలుపెట్టి 15 నిమిషాల వరకు ఉడకనివ్వాలి. తరువాత స్టవ్ ఆపి ఒక పది నిమిషాల తర్వాత దాన్ని తీసి సర్వ్ చేసుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన డబల్ మసాలా దమ్ బిర్యాని రెడీ…

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది