Chicken Biryani Recipe : చికెన్ బిర్యాని కి ఇలా మసాలా పెట్టి చేస్తే చాలా రుచిగా కుదురుతుంది…!
Chicken Biryani Recipe : ఈరోజు రెసిపీ వచ్చేసి చెట్టినాడు చికెన్ బిర్యాని. తక్కువ టైంలోనే మసాలా బిర్యాని చేసి చూపించబోతున్నాను. దీని టేస్ట్ అయినా కలర్ అయినా చాలా చాలా బాగుంటుంది. చేసే ప్రాసెస్ చాలా సింపుల్గా ఉన్నప్పటికీ రుచి మాత్రం చాలా సూపర్ గా ఉంటుంది. ఈ చేట్టి నాడి మసాలా బిర్యాని తయారు చేసి చూద్దాం… దీనికి కావలసిన పదార్థాలు : చికెన్, బాస్మతి రైస్, ఎండు మిరపకాయలు, దాల్చిన చెక్క ,లవంగాలు, యాలకులు, జాపత్రి, అనాసపువ్వు, బిర్యానీ ఆకు, ధనియాలు, కొత్తిమీర, పుదీనా, పెరుగు, పసుపు, కారం ఉప్పు, అల్లం, ఎల్లిపాయలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, మొదలైనవి… దీని తయారీ విధానం : ముందుగా ఒక కేజీ చికెన్ తీసుకుని చికెన్ లెగ్ పీస్ కి గాట్లు పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి.
తర్వాత ఒక రెండు గ్లాసుల బియ్యం తీసుకుని శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఒక ఇంచె దాల్చిన చెక్క, నాలుగు లవంగాలు, నాలుగు యాలకులు, ఒక జాపత్రి, నాలుగైదు ఎండు మిరపకాయలు, కొంచెం జీలకర్ర, కొంచెం సోంపు, రెండు స్పూన్లు ధనియాలు వేసి మెత్తటి పౌడర్ల పట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే జార్ లో కొంచెం ఆల్లం, నాలుగైదు రెబ్బలు ఎల్లిపాయలు, నాలుగు పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసి పేస్ట్ ల పట్టిపక్కనుంచుకోవాలి. తర్వాత స్టౌ పై కుక్కర్ని పెట్టుకుని దానిలో 4,5 గిన్నెలు ఆయిల్ వేసుకొని ముందుగా ఒక బిర్యానీ ఆకు, ఒక దాల్చిన చెక్క, నాలుగు యాలకులు, నాలుగు లవంగాలు వేసి తర్వాత ఒక బిర్యానీ ఆకు వేసి ఎర్రగా వేయించుకున్న తర్వాత ఒక కప్పు ఉల్లిపాయలు కూడా వేసి బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించుకోవాలి.
తర్వాత ముందుగా గాట్లు పెట్టుకున్న చికెన్ ని వేసి బాగా ఎర్రగా మగ్గనివ్వాలి. తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న అల్లం పేస్ట్ ని కూడా వేసి మూత పెట్టి 10 15 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. తర్వాత ఒక అర కప్పు పెరుగు కూడా వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం కారం వేసి కలుపుకోవాలి. ఒక పది నిమిషాల తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న మసాలా ని కూడా వేసి బాగా కలిపి మూత పెట్టి ఐదు నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఐదు నిమిషాల తర్వాత ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని దానిలో వేసి బాగా కలుపుకొని కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసి కలుపుకొని కుక్కర్ కి మూత పెట్టి మూడు విజిల్స్ వచ్చేవరకు ఉడికించుకోవాలి. అంతే మూడు విజిల్స్ వచ్చిన తర్వాత బిర్యానీ రెడీ అయినట్లే ఎంతో సింపుల్గా చెట్టినాడు మసాలా బిర్యాని రెడీ. దీని రుచి చాలా చాలా బాగుంటుంది.
