KCR : సంచలనం సృష్టించబోతున్న కేసీఆర్.. చకచకా రాజకీయ నిర్ణయాలు..
KCR : తెలంగాణ సీఎం కేసీఆర్ గ్రాఫ్ రోజురోజుకూ బాగా పడిపోతుందనే వార్తలు ఇటీవల కాలంలో వస్తున్నాయి. ఇందుకు సంబంధించి పలు సర్వేలు, హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితాలు కూడా తోడవుతున్నాయి. మొత్తంగా టీఆర్ఎస్ పార్టీలో కొంత ఉత్సాహం తగ్గుతుందనే సమయంలో సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయాలు ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది. ఆ నిర్ణయాల ద్వారా గులాబీ పార్టీలోని నేతలు, కేడర్‌లో జోష్ నింపాలని కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం.చాలా కాలం పాటు ప్రెస్ మీట్‌లకు దూరంగా ఉన్న సీఎం కేసీఆర్ ప్రస్తుతం ప్రెస్ మీట్‌లు పెట్టి మరీ బీజేపీని విమర్శిస్తున్నారు. వరి సాగు విషయంలో కమలనాథులపై యుద్ధాన్ని ప్రకటించిన సీఎం కేసీఆర్.. మరో వైపు సొంత పార్టీ బలాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నట్లు కనబడుతోంది.
ఈ క్రమంలోనే టీఆర్ఎస్ పార్టీలో భారీ ఎత్తున పదవుల పంపకాలు చేయబోతున్నారు. తెలంగాణ హిస్టరీలోనే ఎన్నడూ లేని విధంగా పది రోజుల వ్యవధిలోనే ఏకంగా 18 ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేయబోతున్నారు. ఆ తర్వాత కేబినెట్‌ను కూడా ప్రక్షాళన చేయబోతున్నట్లు సమచారం. ఖాళీగా ఉన్న శాసనమండలి చైర్మన్ పదవిని కూడా భర్తీ చేయబోతున్నారు. మొత్తంగా టీఆర్ఎస్ పార్టీలోని నేతల్లో జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నారు కేసీఆర్. ఎమ్మెల్యే కోటాల ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు, స్థానిక సంస్థల కోటాలో 12 ఎమ్మెల్సీలకు మంగళవారం నోటిఫికేషన్ విడుదలైంది. గవర్నర్ కోటాలో మరో ఎమ్మెల్సీ స్థానాన్ని భర్తీ చేయనున్నారు. దాంతో టీఆర్ఎస్ పార్టీలో సందడి నెలకొంది. పింక్ పార్టీలోని కొందరు నేతలు తమకు పదవులు వరిస్తాయని సంతోషంగా ఉన్నట్లు తెలుస్తోంది.
KCR : బీజేపీతో ఢీ అంటే ఢీ అంటున్న కేసీఆర్..
గవర్నర్ కోటా కాకుండా ఎన్నిక జరిగే 18 ఎమ్మెల్సీ స్థానాలకు 18కి 18 స్థానాలు పింక్ పార్టీకే లభించే చాన్సెస్ ఉన్నాయి. ఇకపోతే ఈ ప్రక్రియ పూర్తి కాగానే సీఎం కేసీఆర్ తన కేబినెట్‌ను ప్రక్షాళన చేసే దిశగా అడుగులు వేయబోతున్నారని సమాచారం. కేబినెట్‌లోకి కొత్తగా ఇద్దరిని తీసుకోబోతున్నారని తెలుస్తోంది. అయితే, అధికార టీఆర్ఎస్ పార్టీలో పదవుల కోసం ఆశావహులు అయితే చాలా మందే ఉన్నారు.