KCR : ఆంధ్రప్రదేశ్ లో BRS సూపర్ హిట్ కొట్టడం కోసం కేసీఆర్ ప్లాన్ ఇదే..!
KCR : టీఆర్ఎస్ పార్టీ కాస్త బీఆర్ఎస్ గా మారింది. బీఆర్ఎస్ పార్టీ అంటే ఒక్క తెలంగాణ మాత్రమే కాదు.. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల్లోనూ విస్తరించాలి. దాని కోసం తెలంగాణ సీఎం కేసీఆర్ పక్కా ప్లాన్ వేస్తున్నారు. ఒకేసారి అన్ని రాష్ట్రాలను ఢీకొట్టకుండా.. ఒక్కో రాష్ట్రంలో బీఆర్ఎస్ పాపులారిటీని పెంచుకుంటూ వెళ్తున్నారు. అయితే.. ముందు మరో తెలుగు రాష్ట్రమైన ఏపీపై కేసీఆర్ ఫోకస్ పెంచారు.ఏపీలో బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు, విస్తరణపై వాళ్లతో చర్చించారు.
అందుకే ఏపీలో బీఆర్ఎస్ విస్తరణ కోసం అడుగులు పడుతున్నాయి. కొందరు మంత్రులకు ఏపీలో పార్టీ విస్తరణ బాధ్యతను కేసీఆర్ అప్పగించారు. నిజానికి.. ఏపీలో సీఎం జగన్ తో కేసీఆర్ కు సత్సంబంధాలే ఉన్నాయి. కాకపోతే ప్రత్యర్థ పార్టీ టీడీపీతో మాత్రం అంటీముట్టనట్టుగానే కేసీఆర్ ఉంటున్నారు. ఈనేపథ్యంలో ఏపీలో బీఆర్ఎస్ ఎంట్రీ ఎలా ఉంటుందన్న ఆసక్తి అందరిలోనూ వస్తోంది. ఈనేపథ్యంలో ఏపీకి చెందిన పలువురు నేతలతో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు.
KCR : ఏపీకి చెందిన పలువురు నేతలతో కేసీఆర్ భేటీ
ఇప్పటికే ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు ప్రారంభం అయిన విషయం తెలిసిందే. ఏపీతో పాటు కర్ణాటక, మహారాష్ట్రలో ప్రస్తుతం పార్టీని విస్తరించే పనిలో పడ్డారు. అయితే.. వచ్చే వారం.. పార్టీ అజెండా ఏంటి.. అనేది ఢిల్లీలో సీఎం కేసీఆర్ ప్రకటించనున్నారు. అంతకుముందే ఏపీతో పాటు కర్ణాటక, మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీ శాఖలను ఏర్పాటు చేయనున్నారు. ఈ మూడు రాష్ట్రాలు తెలంగాణకు సరిహద్దున ఉన్న రాష్ట్రాలు కావడంతో ముందు ఫోకస్ ఈ రాష్ట్రాలపై పెట్టారు సీఎం కేసీఆర్.