Munugodu Bypoll : మునుగోడు టికెట్ ను కన్ఫమ్ చేసిన కేసీఆర్.. ఎవరికి ఇచ్చారో తెలుసా?
Munugodu Bypoll : నేను మోనార్క్ ను నన్నెవరూ మోసం చేయలేరు అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పుడప్పుడు ప్రవర్తిస్తుంటారు. తాజాగా మునుగోడు విషయంలోనూ అదే జరిగింది అని తెలుస్తోంది. ఎందుకంటే ఇంకొన్ని రోజుల్లో మునుగోడులో ఎన్నికలు జరగనున్నాయి. మునుగోడు ఉపఎన్నిక జరగనుంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో మునుగోడు ఉపఎన్నిక అనివార్యం అయింది. ఇంకో ఏడాదిలో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు రానున్నాయి. కానీ.. ఆ ఎన్నికల కంటే ముందు మునుగోడు ఉపఎన్నిక రావడంతో తెలంగాణ రాజకీయాలన్నీ ఒక్కసారిగా మారిపోయాయి.
మునుగోడు ఉపఎన్నికపై సీఎం కేసీఆర్ మరోసారి తాను మోనార్క్ ను అని నిరూపించుకున్నారు. ఎందుకంటే.. మునుగోడు ఉపఎన్నిక కోసం ఈసారి కేసీఆర్ టికెట్ ఎవరికి ఇస్తారు అందరూ టెన్షన్ పడుతున్న వేళ.. 2018 ఎన్నికల్లో కోమటిరెడ్డి చేతిలో ఓడిపోయిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికే కేసీఆర్ టికెట్ కన్ఫమ్ చేసినట్టు తెలుస్తోంది.
Munugodu Bypoll : కూసుకుంట్లకు టికెట్ ఇస్తే మేమే ఓడిస్తామన్న టీఆర్ఎస్ శ్రేణులు
నిజానికి.. మునుగోడులో ప్రస్తుతం కూసుకుంట్లకు అంత పాపులారిటీ లేదు. అందులోనూ టీఆర్ఎస్ నేతల మధ్యే అంతర్గత పోరు నడుస్తోంది. దీంతో ఆయనకు మళ్లీ టికెట్ ఇస్తే మాత్రం ఓడించి తీరుతామని టీఆర్ఎస్ శ్రేణులు గట్టిగా నిరసనలు చేపట్టారు. అయినా కూడా సీఎం కేసీఆర్ మాత్రం కూసుకుంట్ల వైపే మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. మునుగోడు టీఆర్ఎస్ శ్రేణుల గోడును కేసీఆర్ అస్సలు పట్టించుకోవడం లేదంటూ వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఉమ్మడి నల్గొండ జిల్లా నేతలతో సీఎం కేసీఆర్ సమావేశం అయ్యారు. అందులో అధికారికంగా ఇంకా మునుగోడు అభ్యర్థి విషయాన్ని చెప్పినప్పటికీ.. అభ్యర్థిగా మాత్రం కూసుకుంట్లనే ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
కూసుకుంట్ల కొద్ది తేడాతోనే 2018 ఎన్నికల్లో ఓడిపోయాడని కేసీఆర్ చెబుతున్నప్పటికీ.. 2018 ఎన్నికల్లో కోమటిరెడ్డి చేతిలో కూసుకుంట్ల 22 వేల ఓట్ల తేడాతో ఓడిపోయాడు. అది కొద్ది తేడా కాదు కదా. మరోవైపు నల్గొండ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి తమ్ముడు కృష్ణారెడ్డి కూడా మునుగోడు టికెట్ ను ఆశిస్తున్నాడు. దీంతో కేసీఆర్.. ఆయనతో ప్రత్యేకంగా సమావేశమయి.. వేరే రూపంలో ఆయనకు పార్టీ స్థానం కల్పిస్తుందని భరోసా ఇచ్చారు. అంటే మునుగోడు టికెట్ ను కేసీఆర్.. కూసుకుంట్లకే కన్ఫమ్ చేసినట్టు తెలుస్తోంది. అందుకే.. కృష్ణారెడ్డికి మరో పదవిని ఇచ్చేందుకు సీఎం కేసీఆర్ రెడీ అయినట్టు తెలుస్తోంది.