Munugodu Bypoll : జగన్ నే కాపీ కొడుతోన్న కేసీఆర్.. మునుగోడు బరిలో ప్రూఫ్ చూసుకోండి
Munugodu bypoll : మునుగోడు ఉపఎన్నిక వచ్చే నెల జరగనుంది. ఇప్పటికే మునుగోడు ఉపఎన్నికకు సంబంధించిన షెడ్యూల్ ను ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. మునుగోడులో ఎలాగైనా గెలవాలని తెగ ఆరాటపడుతున్నారు సీఎం కేసీఆర్. టీఆర్ఎస్ గెలుపు కోసం భారీగానే వ్యూహాలు పన్నుతున్నారు. అందుకే భారీ సంఖ్యలో ఉపఎన్నిక కోసం సీఎం కేసీఆర్ ఇన్ చార్జ్ లను నియమించారు. నిజానికి.. ఇదంతా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎప్పటి నుంచో చేస్తున్నది. ఎన్నికలకు రెండేళ్ల ముందు నుంచే ప్రతి ఎమ్మెల్యేను వాళ్లు నియోజకవర్గంలో ఉండాలని, ప్రతి గడపకు వెళ్లాలని, సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయో లేదో తెలుసుకోవాలని స్పష్టం చేస్తున్నారు.
ఇప్పుడు కేసీఆర్ దాన్నే ఫాలో అవుతున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే.. మునుగోడు నియోజకవర్గాన్ని 86 యూనిట్లుగా సీఎం కేసీఆర్ విభజించారు. అక్కడ ప్రతి యూనిట్ కు ఒక ఎమ్మెల్యేను ఇన్ చార్జ్ గా నియమించారు. అంటే.. 86 మంది ఎమ్మెల్యేలు అక్కడే ఉన్నారన్నమాట. నిజానికి దసరా తెల్లారే అందరూ మునుగోడుకు వెళ్లిపోయారు. అక్టోబర్ 5న కేసీఆర్ జాతీయ పార్టీని ప్రకటించిన విషయం తెలిసిందే. తెల్లారే అందరూ మునుగోడుకు వెళ్లి తమ యూనిట్ లో ప్రచారాన్ని ప్రారంభించారు. స్థానిక టీఆర్ఎస్ నేతలతో కలిసి.. ప్రతి ఎమ్మెల్యే తన యూనిట్ లో మద్దతుదారులతో కలిసి ప్రతి గామానికి వెళ్లి అక్కడ గడప గడపకు తిరిగి ప్రచారం చేయాలని సీఎం కేసీఆర్ నిర్దేశించారు.
Munugodu bypoll : ప్రతి ఎమ్మెల్యే గడపగడపకు వెళ్లి ప్రచారం చేయాలి
ఒక ఎమ్మెల్యే ఒక ఇంటికి కనీసం మూడు సార్లు వెళ్లాలి. గడప గడపకు ఎమ్మెల్యేలు వెళ్లడం ద్వారా మాత్రమే ఓటర్లను ఆకట్టుకోగలమని కేసీఆర్ స్పష్టంగా చెప్పుకొచ్చారు. ప్రచారంలో పాల్గొనే విషయాలు, అక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు తాను ఫీడ్ బ్యాక్ తెప్పించుకొని చూస్తానని కూడా సీఎం కేసీఆర్ హెచ్చరించారు. ఇదివరకు ఎప్పుడూ ఏ ఎన్నికను కూడా సీఎం కేసీఆర్ ఇంత సీరియస్ గా తీసుకున్నది లేదు. కానీ.. మునుగోడును మాత్రం చాలా సీరియస్ గా తీసుకున్నారు. అయితే.. ఇదంతా ఏపీ సీఎం జగన్ ఎప్పటి నుంచో చేస్తున్నారని అంటున్నారు. ఏపీ సీఎం జగన్ ఇప్పటికే ఏపీలో గడపకు గడపకు ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని ప్రారంభించారని, దాన్నే కేసీఆర్ ఉపఎన్నికకు వాడుతున్నారని చెబుతున్నారు.