Munugodu Exit Polls : మునుగోడు ఎగ్జిట్ పోల్స్.. గెలిచేది ఎవరో తెలిసిపోయింది.. అన్ని సర్వేలు ఆ పార్టీవైపే
Munugodu Exit Polls : తెలంగాణలోనే కాదు.. దేశవ్యాప్తంగా మునుగోడు ఉపఎన్నిక చర్చనీయాంశం అయింది. దేశంలోనే అత్యంత ఖరీదైన ఎన్నికలుగా మునుగోడును చెప్పుకున్నారు. ఎంతో ఉత్కంఠభరితంగా ఎన్నికలు సాగాయి. మునుగోడు ఉపఎన్నికలు పూర్తికాగానే వెంటనే ఎగ్జిట్ పోల్స్ ను పలు సర్వే సంస్థలు ప్రకటించాయి. పీపుల్స్ పల్స్, ఆత్మ సాక్షి, త్రిశూల్, ధర్డ్ విజన్ లాంటి సంస్థలు మునుగోడు ఉపఎన్నికల్లో సర్వేలు నిర్వహించాయి. ఎన్నికలు పూర్తికాగానే వాటి ఫలితాలను ప్రకటించాయి.
అయితే.. దాదాపు అన్ని సర్వేసంస్థలు టీఆర్ఎస్ అభ్యర్థికే ఎక్కువ ఓట్లు వస్తాయని ప్రకటించాయి. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుస్తారని స్పష్టం చేశాయి. ఆ తర్వాత రెండో స్థానంలో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మూడో స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి నిలుస్తారని తెలిపాయి.
Munugodu Exit Polls : టీఆర్ఎస్ అభ్యర్థికి 40 శాతానికి పైనే ఓట్లు
మొత్తం పోలైన ఓట్లలో ఆత్మసాక్షి సర్వే ప్రకారం టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి 41 నుంచి 42 శాతం ఓట్లు వస్తాయని తెలిపింది. బీజేపీ పార్టీకి 35 నుంచి 36 శాతం, కాంగ్రెస్ అభ్యర్థికి 16.5 శాతం నుంచి 17.5 శాతం, బీఎస్పీ అభ్యర్థికి 4 నుంచి 5 శాతం వరకు ఓట్లు వస్తాయని ప్రకటించింది. ఇక.. పీపుల్స్ పల్స్ అనే సంస్థ టీఆర్ఎస్ పార్టీకి 44.4 శాతం, బీజేపీ పార్టీకి 37.3 శాతం, కాంగ్రెస్ పార్టీకి 12.5 శాతం, ఇతర పార్టీలకు 5.8 శాతం ఓట్లు వస్తాయని తెలిపింది. థర్డ్ విజన్ సంస్థ సర్వే ప్రకారం టీఆర్ఎస్ పార్టీకి 48 నుంచి 51 శాతం, బీజేపీకి 31 నుంచి 35 శాతం, కాంగ్రెస్ పార్టీకి 13 నుంచి 15 శాతం, బీఎస్పీకి 5 నుంచి 7 శాతం ఓట్లు వస్తాయని తెలిపింది. అయితే.. కేఏ పాల్ పార్టీ ప్రజా శాంతికి ఒక శాతం ఓట్లు వస్తాయని ధర్డ్ విజన్ సంస్థ తెలిపింది. ఇక.. త్రిశూల్ సంస్థ టీఆర్ఎస్ పార్టీకి 47 శాతం, బీజేపీ పార్టీకి 31 శాతం, కాంగ్రెస్ పార్టీకి 18 శాతం, ఇతర పార్టీలకు 4 శాతం ఓట్లు వస్తాయని తెలిపింది.