YS Jagan : వైయస్‌ఆర్ పింఛన్ కానుక.. ప్రతి అవ్వ తాత గుండెల్లో వైయస్ జగన్
YS Jagan : వైయస్ రాజశేఖర్ రెడ్డి సీఎం కాకముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతి తక్కువ మందికి.. అది కూడా నెలకు 75 రూపాయల చొప్పున పింఛన్ ఇచ్చేవారు. ఎప్పుడైతే రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి వచ్చారో.. ఇక అప్పటి నుంచి పేద వృద్దులు, దివ్యాంగులకు ఇస్తున్న పింఛన్ ను రూ. 200కు పెంచారు. ఆ నిర్ణయం అప్పట్లో ఒక సంచలనంగా నిలిచింది. 200 రూపాయలకు పింఛన్ పెంచడంతో పాటు.. కొత్తగా మరో 23 లక్షల మందికి రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం మంజూరు చేసి ఆపన్నహస్తం అందించారు. వృద్దులకు.. వితంతువులకు మరియు దివ్యాంగులందరికి కూడా పింఛన్ అందాలనే ఉద్దేశ్యంతో అప్పటి ప్రభుత్వం నిబంధనలు సులభతరం చేయడం జరిగింది.
ఇక అప్పటి నుంచి పింఛన్ అనగానే రాజశేఖర్ రెడ్డి గుర్తుకు వచ్చేవారు. తండ్రికి తగ్గ తనయుడిగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి పేదలకు ఆపన్నహస్తం అందించి… వారి గుండెల్లో నిలుస్తున్నారు. రాష్ట్రంలోని అర్హులు అయిన ప్రతి ఒక్కరికి కూడా పింఛన్ ను అందిస్తున్న ఘనత కేవలం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మాత్రమే దక్కుతుంది. ఇటీవల కాలంలో పెరిగిన ఖర్చులు.. వృద్దుల అవసరాల దృష్ట్యా నెలకు 2500 రూపాయలను వైయస్‌ఆర్ పింఛన్ కానుక పేరుతో నేరుగా ఇంటింటికి వెళ్లి మరీ వృద్దులు, ఒంటరి మహిళలు తదితర అర్హులకు అందజేస్తున్నారు.
YS Jagan : వైయస్‌ఆర్ పింఛన్ కానుకకు నో పాలిటిక్స్..
ప్రతి నెల రూ.1543.17 కోట్లను పింఛన్ కోసం జగన్ ప్రభుత్వం కేటాయిస్తోంది. మే నెల ప్రారంభం కాకముందే ప్రభుత్వ ఖజానా నుండి పింఛన్ డబ్బును విడుదల చేయడం జరిగింది. ఒక్కరోజు కూడా ఆలస్యం లేకుండా ఒకటవ తారీకునే పింఛన్ ను ఇస్తున్న ఘనత దేశంలో కేవలం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మాత్రమే దక్కుతుంది. నవరత్నాల హామీ లో భాగంగా అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛన్ మొత్తంను భారీగా పెంచడంతో పాటు.. గతంలో ఉన్న కఠిన నిబంధనలను తొలగించి అర్హులు అయిన ప్రతి ఒక్కరికి కూడా పింఛన్ ఇచ్చేందుకు జగన్ సర్కార్ సిద్దం అయ్యింది.
గత ప్రభుత్వంలో పార్టీ కార్యకర్తలు మరియు ఇతర సమీకరణాలు చూసి మరీ పింఛన్ ను ఇచ్చేవారనే ఆరోపణలు ఉన్నాయి. అలాగే అర్హులు అయిన వారికి కాకుండా అనర్హులకు పింఛన్ లు ఇచ్చిన ఘనత కూడా గత ప్రభుత్వాలదనే ఆరోపణలు లేకపోలేదు. కానీ.. ఇప్పుడు అర్హులు అయిన ప్రతి ఒక్కరికి కూడా పింఛన్ ఇవ్వడంతో పాటు అత్యంత పారదర్శంగా పింఛన్ అర్హులను ఎంపిక చేస్తున్నారు. ఎక్కడా రహస్యం లేదు.. ఎక్కడ కూడా గోప్యత అనేది లేకుండా ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా గ్రామ వాలంటీర్ లు వెళ్లి మరీ పింఛన్ ను అవ్వలు, తాతలు, ఇతర అర్హులందరికీ అందిస్తున్నారు.
YS Jagan : ప్రతి ఒక్క అవ్వ తాత గుండెల్లో జగన్…
కేవలం వయసు పైబడిన వాళ్లకు మాత్రమే కాకుండా దివ్యాంగులు మరియు దీర్ఘ కాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి.. తోడు లేని ఒంటరి మహిళకు ఇలా అర్హులైన ప్రతీ ఒక్కరికీ పింఛన్ ఇస్తూ జగన్ సర్కార్ అభయహస్తం అందిస్తోంది. రాష్ట్రంలో ఎన్ని ఆర్థిక ఇబ్బందులు వచ్చినా కూడా పింఛన్ అనేది ఆపకుండా ఇస్తూ.. ఇతర రాష్ట్రాలకు కూడా ఆదర్శంగా నిలిచేలా జగన్ ప్రభుత్వం పని చేస్తోంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ పింఛన్ పథకం రాబోయే ఎన్నికల్లో జగన్ పార్టీని మరోసారి అద్బుతమైన విజయం దిశగా తీసుకు వెళ్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పింఛన్ తీసుకుంటున్న ప్రతి ఒక్క అవ్వ.. తాత.. అక్క.. తమ్ముడు కూడా జగన్ ను తమ గుండెల్లో పెట్టుకుని పూజిస్తున్నారు.
పేదల సంక్షేమమే ధ్యేయంగా.. వారి అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఆలస్యం లేకుండా పెద్దమొత్తంలో పింఛన్ అందిస్తున్న జగన్ సర్కార్ ను అర్హులు, అర్హుల కుటుంబసభ్యులతో పాటు ఎంతో మంది దైవంగా భావిస్తున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా వైయస్‌ఆర్ పింఛన్ కానుక ఉందంటూ జాతీయ స్థాయి రాజకీయ నాయకులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పింఛన్ అనేది మరింతగా పెంచేందుకు కూడా జగన్ ప్రభుత్వం భవిష్యత్తులో ప్రణాళిక సిద్దం చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. వృద్ధాప్యంలో ఇబ్బందులు పడవద్దనే ఉద్దేశ్యంతో సీఎం జగన్ ఇస్తున్న పింఛన్ అర్హులకు ఎంతో తోడ్పాటును అందిస్తుంది అంటూ క్షేత్ర స్థాయిలో చర్చ జరుగుతోంది.