CM Jagan : జనాలను చంపి చంద్రబాబు మొసలి కన్నీరు… మీ పబ్లిసిటీ కోసం ప్రజలను బలిచేస్తారా.. సీఎం జగన్
CM Jagan : వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని సీఎం జగన్ పేర్కన్నారు. పేదలు, రైతులు రాష్ర్ట ప్రభుత్వానికి రెండు కళ్లు అని అన్నారు. అధికారంలోకి రాగానే రూ. 2000గా ఉన్న పింఛన్ మొత్తాన్ని ప్రతి ఏటా రూ.250 పెంచుకుంటూ పోతామన్న హామీని మీ బిడ్డగా నిలబెట్టుకున్నానని సీఎం జగన్ పేర్కొన్నారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీని తూచా తప్పకుండా పాటింటి ప్రతి అవ్వా తాత ముఖంలో ఆనందం తెచ్చామన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో పింఛన్ల కోసం అధికారుల చుట్టూ తిరిగే పరిస్థితి నుంచి వలంటీర్లు ఫించన్ దారుల ఇంటి వద్దకే ఇచ్చే పరిస్థితి తెచ్చామన్నారు. వైఎస్సార్ పెన్షన్ కానుక పంపిణీ లబ్ధిదారులతో పెంచిన పింఛన్లను రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాల గ్రౌండ్ లో నిర్వహించిన ముఖాముఖి సభలో సీఎం జగన్ మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా రూ. 2,750 పెన్షన్ పెంపుతో లబ్ధిదారుల్లో ఆనందోత్సాహాలు వెల్లువెత్తుతున్నాయన్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పింఛన్ అందించడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం జగన్ పేర్కొన్నారు.
లంచాలు లేని పరిపాలనతో వ్యవస్థలో సమూల మార్పులు తెచ్చామని సగర్వంగా చెప్తున్నట్లు సీఎం జగన్ పేర్కొన్నారు. పింఛన్ మొత్తాన్ని రూ. 2,500 నుంచి రూ.2,750కి పెంచి ఖర్చుకు వెనకాడకుండా లబ్ధిదారుల సంక్షేమం కోసమే రాష్ర్ట ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తోందని సీఎం జగన్ పేర్కొన్నారు. పెంచిన పింఛన్లు అవ్వా తాతలతో పాటు వితంతువులు, చేనేతలు, కల్లుగీత కార్మికులు, ఒంటరి మహిళలు, మత్స్యకారులు, సాంప్రదాయ వృత్తిపై ఆధారపడి ఉన్న చర్మకారులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు ప్రస్తుతం పెంచిన పింఛన్లు వర్తిస్తాయన్నారు. ఏకంగా 64 లక్షల మంది కుటుంబాలలో మరిన్ని చిరునవ్వులు నింపుతూ మరికొంత ఆర్ధిక సౌలభ్యం జరుగుతుందిగత టీడీపీ ప్రభుత్వంలో కేవలం 39 లక్షల మందికి మాత్రమే పెన్షన్ అందేదని వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత 64 లక్షల మందికి పెన్షన్ ఇస్తున్నట్లు వివరించారు. చంద్రబాబు హయాంలో పెన్షన్ల కోసం చేసిన ఖర్చు కేవలం రూ.400 కోట్లు మాత్రమేనన్నారు.
మన ప్రభుత్వంలో కేవలం పెన్షన్ల కోసమే రూ.1,765 కోట్లు కేటాయిస్తున్నట్లు వివరించారు. మూడున్నరేళ్లలో పెన్షన్ల కోసం మాత్రమే రూ. 62, 500 కోట్లు ఖర్చు చేశామని సీఎం జగన్ ప్రకటించారు. రూ. 2,750 నుంచి పదివేల రూపాయల వరకు ఫించన్ అందిస్తున్నది దేశంలోనే ఏపీ ఒక్కటే అని సీఎం జగన్ అన్నారు. రూ.10 వేల వరకు పింఛన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం మనదే. పుట్టుకతో లేదా పుట్టిన తర్వాత కానీ అంగవైకల్యానికి గురైన అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ములకు దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నవారికి, డయాలసిస్ చేసుకుంటున్నవారికి, తలసీమియా, సికిల్‌సెల్‌ఎనీమియా, హీమోఫీలియా, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు, బోదకాలు, పక్షవాతం వచ్చి మంచానికే పరిమితమైన వాళ్లకు, కండరాల క్షీణత, కుష్టువ్యాధి, కిడ్నీ, కాలేయం,గుండె ట్రాన్స్‌ఫ్లాంట్ జరిగిన నిరుపేదలందరికీ రాష్ర్ట ప్రభుత్వం పింఛన్ ఇస్తోంది. దేశంలోనే ఎక్కడా లేని విధంగా రూ.2,750 నుంచి రూ.10వేల వరకు పింఛన్ ఇస్తున్న ఏకైకా రాష్ట్రం మనదే. అని సీఎం జగన్ ప్రకటించారు. పింఛన్లు కేవలం వృద్ధులకు మాత్రమే కాకుండా ఇతర ఆనారోగ్య సమస్యలతో బాధపడుతున్న అర్హులందరికీ ఠంచనుగా అందిస్తున్నామని తెలిపారు.
కొత్తగా జారీ చేసిన పింఛన్లకు ప్రభుత్వం నిధులను సత్వరమే విడుదల చేసినట్లు పేర్కొన్నారు. కొత్తగా మంజూరైన బియ్యం కార్డులు, ఆరోగ్య శ్రీ కార్డులు వలంటీర్లు ఇంటికి వెళ్లి లబ్ధిదారులకు అందిస్తున్నారని సీఎం ప్రకటించారు. జన్మభూమి కమీటీల్లా.. మన ప్రభుత్వంలో వివక్ష లేదు గత టీడీపీ ప్రభుత్వంలో జన్మభూమి కమిటీల తరహాలో లబ్ధిదారులకు ఫించన్ ప్రయోజనం అందించే అంశంలో ఒక్క శాతం వివక్ష కూడా చూపడం లేదని సీఎం జగన్ పేర్కొన్నారు. చంద్రబాబు హయాంలో పింఛన్ కావాలంటే జన్మభూమి కమిటీల చుట్టూ తిరగి లంచం ఇస్తే తప్ప పెన్షన్ మంజూరు అయ్యేది కాదన్నారు. కానీ మన ప్రభుత్వంలో ఎలాంటి వివక్షకు తావులుదన్నారు. అవినీతి, లంచాలు, పార్టీలు, కులం, మతం లాంటి వివక్షలకు తావులేదని సీఎం జగన్ పేర్కొన్నారు. అర్హత ఉన్న ప్రతి అవ్వా తాతకు ఇంటి వద్దకే వెళ్లి పింఛన్ ఇవ్వడం ప్రభుత్వ ప్రాథమిక భాద్యతగా భావిస్తామన్నారు. మీ బిడ్డ ప్రభుత్వంలో మాత్రమే జరుగుతున్న అతి గొప్ప విజయమని పేర్కొన్నారు.
చంద్రబాబు నైజం ఇదీ.. కోర్టులో జడ్జి ముందుకు వచ్చి ‘అయ్యా తల్లిదండ్రులు లేని వాడ్ని నన్ను శిక్షించకండి’ అని బోరున ఒకాయన ఏడ్చాడట. ఆ ఏడ్పు చూసి జడ్జిగారు జాలిపడి ప్రాసిక్యూటర్‌ను నిందితుడు చేసిన తప్పేంటి అని అడగారట’ నిజమే సార్ ఈ మనిషికి తల్లిదండ్రులు లేరు అన్నారట కారణం, ఆ తల్లిదండ్రులను చంపేసిన వ్యక్తే ఇతనే అని చెప్పరట’ చంద్రబాబును చూస్తే ఇలాగే అనిపిస్తోంది అని సీఎం జగన్ సభలో అన్నారు. చంద్రబాబు తొలి దశ నుంచి ఎన్టీఆర్‌ను అడ్డుపెట్టుకుని శవ రాజకీయాలు చేశారని ఇలాంటి ప్రతిపక్ష నేత ఉండటం రాష్ర్టానికి పట్టిన ఖర్మ అని సీఎం జగన్ విమర్శించారు. ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి ఎన్నికలప్పుడు మాత్రం ఎన్టీఆర్ ఫొటోకి దండ వేసి మహానుభావుడంటూ ఓట్లు అడుగుతారని విమర్శించారు. చంపేది చంద్రబాబే మళ్లీ మొసలి కన్నీరు కారుస్తూ డ్రామాలు ఆడుతారని సీఎం జగన్ ఎద్దేవా చేశారు. ఈ పెద్ద మనిషికి తెలిసిందల్లా వెన్నుపోటు పొడవడం, ఫొటోషూట్, డ్రామాలు ఆడటం,
మొసలి కన్నీరు కార్చడం మాత్రమేనని నిజాయితీతో కూడిన రాజకీయాలు ఎన్నడూ చేయలేదన్నారు.చంద్రబాబువి అన్నీ షూటింగ్ ప్రచారాలే.. చంద్రబాబు తన సభలకు రాని జనాలను ఎల్లో మీడియాలో వచ్చినట్లు చూపించి, ఇతర ప్రాంతాల ప్రజలను మభ్య పెట్టేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. ఫొటో షూట్, డ్రోన్ షాట్‌ల కోసం గతంలో రాజమండ్రి వద్ద గోదావరి పుష్కరాల్లో 29 మందిని బలి తీసుకున్నారు. ముహూర్తం పేరుతో చేసిన ప్రచారంపై చంద్రబాబును నిలదీస్తే కుంభమేళాలో తొక్కిసలాట జరగదా జనం చనిపోలేదా? అంటూ వెటకారం చేశారని సీఎం జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. కందుకూరు సభలో జనం తక్కువ వస్తే ఎక్కువ మంది వచ్చారని చూపించేందుకు చిన్న రోడ్డులో ర్యాలీ నిర్వహించి ఎనిమిది మందిని బలిగొన్నారని ఆరోపించారు. వెంటనే ఆసుపత్రికి వెళ్లి డ్రామాలు మొదలు పెట్టేశారని విమర్శించారు. చనిపోయిన వాళ్లకు చెక్కుల పంపిణీ పేరుతో మరో సారి ఫొటో షూట్ చేశారని చంపేసి మానవతావాదిలా నటించే చంద్రబాబు డ్రామాలు నమ్మరాదన్నారు.
ఇంత మంది ప్రాణాలు పోయినా ఎల్లో మీడియా రాయదు. దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబును ప్రశ్నించరని పేర్కొన్నారు. చంద్రబాబుకు ఎల్లో మీడియా దత్త పుత్రుడి అండ ఉంటే తనకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల అండ ఉందన్నారు. రాష్ర్టంలో పేదలకు పెత్తం దారులకు మధ్య జరిగే యుద్ధమే వచ్చే ఎన్నికలని, ఈ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ పేదల పక్షపాతిగా నిలబడిందని సీఎం జగన్ పేర్కొన్నారు. ప్రస్తుతం మన రాష్ట్రంలో జరుగుతున్నది కులాల యుద్ధం కాదు. క్లాస్ ల యుద్ధమని, ఇందులో ఒకవైపు పేదవాడు, మరోవైపు పెత్తందారీ వ్యవస్ధ ఉందని సీఎం జగన్ పేర్కొన్నారు. ఈ యుద్దంలో ఏ మాత్రం పొరపాటు జరిగినా పేదవాడు నాశనమైపోతాడన్న విషయాన్ని మర్చిపోరాదన్నారు. పేద విద్యార్థులకు ఇంగ్లిషు మీడియం చదువులు వద్దంటూ, పేదవాడికి ఇళ్లు కట్టించొద్దంటూ కోర్టులకెళ్లే టీడీపీకి పేదలపై ఏంత కోపం ఉందో తెలుస్తోందన్నారు. 40 ఇయర్స్ ఇండస్ర్టీ అని చెప్పుకునే చంద్రబాబు పేదవాడికి మంచి చేస్తే రాష్ట్రం శ్రీలంక అయిపోతుందంటున్నారని విమర్శించారు.