LPG Cylinder : బ్యాడ్‌న్యూస్.. సిలిండర్స్ రేట్లు ఇలా పెంచేసారేంటి.. వరుసగా ఐదో సారి..!
ప్రధానాంశాలు:
LPG Cylinder : బ్యాడ్‌న్యూస్.. సిలిండర్స్ రేట్లు ఇలా పెంచేసారేంటి.. వరుసగా ఐదో సారి..!
LPG Cylinder : దేశంలో ప్రతి నెలా చమురు కంపెనీలు గ్యాస్ సిలిండర్ ధరలు పెరుగుతూ పోతుండడం మనం చూస్తున్నాం. అందుకు అనుగుణంగా డొమెస్టిక్,కమర్షియల్ గ్యాస్ ధరలను పెంచటం లేదా తగ్గించటం చేస్తుంటాయి. తాజాగా కంపెనీలు డిసెంబర్ నెలకు సంబంధించిన రేట్లను మరోసారి సవరించాయి. హోటల్స్, రెస్టారెంట్లలో ఉపయోగించే 19 కేజీల కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరను రూ.16.5 మేర పెంచుతున్నట్లు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు వెల్లడించాయి. డిసెంబర్ 1వ తేదీ నుంచే కొత్త ధరలు అమలులోకి వస్తాయని తెలిపాయి. వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలు పెరగడం వరుసగా ఇది ఐదోసారి కావడం గమనార్హం.
LPG Cylinder ఇలా పెంచేసారేంటి..
గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగిన నేపథ్యంలో, దేశ రాజధాని దిల్లీలో 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర రూ.16.5 పెరిగి రూ.1819కు చేరుకుంది. కోల్కతాలో రూ.1927, ముంబయిలో రూ.1771, చెన్నైలో రూ.1980కు చేరుకుంది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు పెరగడం వరుసగా ఇది ఐదోసారి. ఆగస్టులో రూ.6.5, సెప్టెంబర్లో రూ.39, అక్టోబరులో రూ.48.5 పెంచారు. నవంబర్‌లో రూ.62 మేర పెంచగా, ఇప్పుడు రూ.16.50 పెంచడం గమనార్హం.ఆయిల్ కంపెనీలు డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు చేయలేదు. ప్రస్తుతం దిల్లీలో 14.2 కిలోల సిలిండర్ ధర రూ.803గా ఉంది. ఉజ్వల లబ్ధిదారులకు మాత్రం రూ.603కే ఇది లభిస్తుంది. ముంబయిలో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర రూ.802.50, చెన్నైలో రూ.818.50, హైదరాబాద్ లో రూ.855గా ఉంది.
ప్రభుత్వ రంగ చమురు సంస్థలైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ భారత్ పెట్రోలియం కార్పొరేషన్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ వాణిజ్య గ్యాస్ సిలిండర్, వంట గ్యాస్ సిలిండర్ ధరలను ప్రకటిస్తూ ఉంటాయి. కాగా దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల్లో మాత్రం గత 20 నెలలుగా ఎటువంటి మార్పు లేదు. ఎల్ పీజీ సిలిండర్ అసలు ధరలను తెలుసుకోవాలనుకుంటే ఇండియన్ ఆయిల్ అధికారిక వెబ్సైట్ https://iocl.com/prices-of-petroleum-products లో చూడవచ్చు. ఇదే వెబ్సైట్లో ఎల్పీజీ ధరలతోపాటు, జెట్ ఫ్యూయెల్, ఆటో గ్యాస్, కిరోసిన్ మొదలైన ఇంధనాల ధరలను కూడా తెలుసుకోవచ్చు.ఆగస్టులో ఒక్కో సిలిండర్ మీద రూ.8.50 పైసలు, సెప్టెంబర్ 1వ తేదీన 39 రూపాయలు, అక్టోబర్‌లో 48.50 పైసలు, నవంబర్‌లో ఏకంగా 62 రూపాయల మేర భారాన్ని వినియోగదారుల మీద మోపాయి. ఇప్పుడు మళ్లీ రూ.16.50 పైసల చొప్పున పెంచాయి.