LPG Cylinder : గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు గుడ్ న్యూస్… మరో 8 నెలల పాటు రూ. 300 సబ్సిడీ ఇవ్వనన్న ప్రభుత్వం…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

LPG Cylinder : గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు గుడ్ న్యూస్… మరో 8 నెలల పాటు రూ. 300 సబ్సిడీ ఇవ్వనన్న ప్రభుత్వం…!

LPG Cylinder  : మన దేశంలో మోడీ సర్కార్ పేద ప్రజల కోసం ఎన్నో పథకాలను అమలులోకి తీసుకొస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే. గ్యాస్ సిలిండర్ వినియోగదారుల కోసం కీలక నిర్ణయాలను తీసుకుంటున్నారు. అయితే ఎన్నికలకు ముందు గ్యాస్ సిలిండర్ ధరలు మాత్రం భారీగా తగ్గిస్తాం అనే నిర్ణయం తీసుకున్నది. అయితే ఇప్పుడు ఆగస్టు నెల మొదలైంది. అయితే ఈ నెలలో మరొకసారి కోట్లాది మంది ప్రజలకు సాధారణ వినియోగదారుల కంటే తక్కువ ధరకే సిలిండర్లను ఇవ్వనున్నారు. అయితే […]

 Authored By ramu | The Telugu News | Updated on :4 August 2024,8:00 am

LPG Cylinder  : మన దేశంలో మోడీ సర్కార్ పేద ప్రజల కోసం ఎన్నో పథకాలను అమలులోకి తీసుకొస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే. గ్యాస్ సిలిండర్ వినియోగదారుల కోసం కీలక నిర్ణయాలను తీసుకుంటున్నారు. అయితే ఎన్నికలకు ముందు గ్యాస్ సిలిండర్ ధరలు మాత్రం భారీగా తగ్గిస్తాం అనే నిర్ణయం తీసుకున్నది. అయితే ఇప్పుడు ఆగస్టు నెల మొదలైంది. అయితే ఈ నెలలో మరొకసారి కోట్లాది మంది ప్రజలకు సాధారణ వినియోగదారుల కంటే తక్కువ ధరకే సిలిండర్లను ఇవ్వనున్నారు. అయితే ముఖ్యమైన విషయం ఏమిటి అంటే. కస్టమర్లు రాబోయే ఎనిమిది నెలల వరకు సదుపాయని పొందుతారు అని తెలుస్తుంది. అయితే ఏ కష్టమర్లు దీని యొక్క ప్రయోజనాన్ని పొందగలరో ఇప్పుడు తెలుసుకుందాం

LPG Cylinder  రూ. 300 ప్రయోజనం

ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింద లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం రూ. 300 సబ్సిడీని ఇవ్వనున్నది. సాధారణ వినియోగదారుల కంటే కూడా లబ్ధిదారులకు రూ. 300 సిలిండర్ వస్తుంది. ఉదాహరణకు దేశ రాజధాని అయిన ఢిల్లీలో సాధారణ కస్టమర్లు రూ. 803 LPG సిలిండర్లను పొందుతున్నారు. అలాగే అదే టైంలో ఉజ్వల యోజన లబ్ధిదారులు రూ. 300 లా తగ్గింపుతో రూ. 503 కే LPG సిలిండర్ పొందుతున్నారు. అయితే ప్రధాన మంత్రి ఎన్నికలకు ముందు ఉజ్వల యోజన కింద పొందినటువంటి సిలిండర్లపై రూ. 300 తగ్గిస్తున్నట్లుగా నిర్ణయం తీసుకున్నది. అయితే ప్రస్తుతం మరొకసారి మోడీ ప్రభుత్వం అధికారంలోకి రావటంతో, అప్పుడు ప్రకటించినటువంటి సబ్సిడీ పథకం మరొక ఎనిమిది నెలల పాటు కొనసాగే అవకాశం ఉంది అని కేంద్ర వర్గాల సమాచారం. అయితే కేంద్ర కేబినెట్ లో కూడా ఈ పథకం కొనసాగింపపై నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం.

ఎనిమిది నెలల పాటు : ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింద కవర్ చేసినటువంటి లబ్ధిదారులు మార్చి 31,2025 వరకు LPG సిలిండర్ లపై రూ. 300 సబ్సిడీని పొందుతారు. అయితే దీని అర్థం వచ్చి మరొక ఎనిమిది నెలల పాటు వినియోగదారులు సిలిండర్లపై రూ. 300 తగ్గింపును పొందుతారు. అయితే ఈ పథకం యొక్క లబ్ధిదారులకు ఒక సంవత్సరానికి 12 రీపీల్స్ ను అందుకుంటారు. అయితే ఈ పథకం కింద 14.2 కిలోల సిలిండర్ పై మాత్రమే ఈ రూ. 300 సబ్సిడీ అనేది వస్తుంది.

LPG Cylinder గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు గుడ్ న్యూస్ మరో 8 నెలల పాటు రూ 300 సబ్సిడీ ఇవ్వనన్న ప్రభుత్వం

LPG Cylinder : గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు గుడ్ న్యూస్… మరో 8 నెలల పాటు రూ. 300 సబ్సిడీ ఇవ్వనన్న ప్రభుత్వం…!

2016 లో ప్రారంభమైనది : ఈ పథకాన్ని 2016లో మొదలుపెట్టారు. ఈ పథకం యొక్క లబ్ధిదారుల గురించి చెప్పాలి అంటే. ఈ పథకాన్ని పొందేవారు తొమ్మిది కోట్ల మందికి పైగా ఉన్నారు. అయితే అదే టైమ్ లో ఈ పథకం కింద 75 లక్షల కొత్త కలెక్షన్లను ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధం అవుతుంది. ఈ విధంగా చూసినట్లయితే 10 కోట్ల మంది కి పైగా లబ్ధిదారులు ఉంటారు అని చెప్పొచ్చు…

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది