Heart Attack : ఈ ఫుడ్ తింటే మీరు వద్దన్నా… హార్ట్ ఎటాక్ వస్తుంది.. అందుకే ఈ ఆహారాన్ని జన్మలో ముట్టుకోవద్దు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Heart Attack : ఈ ఫుడ్ తింటే మీరు వద్దన్నా… హార్ట్ ఎటాక్ వస్తుంది.. అందుకే ఈ ఆహారాన్ని జన్మలో ముట్టుకోవద్దు

 Authored By jagadesh | The Telugu News | Updated on :11 May 2021,12:53 pm

Heart Attack : హార్ట్ ఎటాక్.. లేదా గుండె పోటు.. ఇది చాలా డేంజర్. హార్ట్ అటాక్ వచ్చిందంటే.. ఎంత ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి అయినా సరే.. సెకండ్ల వ్యవధిలో చనిపోవాల్సిందే. గుండె పోటు అంత ప్రమాదకరం. అది ఎప్పుడు వస్తుందో.. ఎందుకు వస్తుందో ఎవ్వరికీ తెలియదు. అందుకే.. హార్ట్ ఎటాక్ రాకుండా ముందే జాగ్రత్త పడాలి. నిజానికి.. హార్ట్ ఎటాక్ కు వయసుతో సంబంధమే లేదు. అన్ని వయసుల వారికి ఇప్పుడు హార్ట్ ఎటాక్ కామన్ అయిపోయింది. చిన్న పిల్లల్లోనూ హార్ట్ ఎటాక్ రావడం మనం గమనిస్తూనే ఉన్నాం. అయితే.. హార్ట్ ఎటాక్ రావడానికి ప్రధాన కారణం మన జీవన శైలి, మనం తినే ఆహారం. అందుకే.. మనం తినే ఆహారాన్ని బట్టే.. మనకు హార్ట్ ఎటాక్ వచ్చే సూచనలు కనిపిస్తాయి.

common foods that can be lead to heart attack

common foods that can be lead to heart attack

మనం తినే తిండే మనకు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది అన్నట్టుగా.. మనం తినే తిండి వల్లనే హార్ట్ ఎటాక్ వచ్చే సూచనలు కనిపిస్తాయి. అసలు.. హార్ట్ ఎటాక్ ఎందుకు వస్తుంది… మనం తినే తిండి.. గుండెకు ఎటువంటి అనారోగ్యాన్ని కలిగిస్తుంది. అసలు.. ఏం తింటే హార్ట్ ఎటాక్ వస్తుంది? ఏం తింటే హార్ట్ ఎటాక్ రాదు.. అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Heart Attack : ఈ ఆహారాన్ని అస్సలు తినకూడదు

హార్ట్ ఎటాక్ మీకు జన్మలో రాకూడదు అని అనుకుంటే… జన్మలో కూడా గుండెకు సంబంధించిన సమస్యలు రావొద్దు అనుకుంటే.. మీరు ఈరోజు నుంచి ఈ ఆహారాన్ని తినడం మానేయాలి. జన్మలో కూడా ఈ ఆహారాన్ని ముట్టుకోకూడదు. అవి ఏంటంటే… బేక్ చేసిన పదార్థాలు.. అంటే ముఖ్యంగా కుకీలు, కేక్స్, పాస్ట్రీలు,.. ఇవన్నీ బేక్ చేసేవే. వీటిలో ఉండే షుగర్ కంటెంట్ వల్ల, ఫ్యాట్స్ వల్ల గుండెకు కొవ్వు పడుతుంది. ప్రతి రోజూ.. కుకీలు, పాస్ట్రీలు, కేకులు ఎక్కువగా తింటే.. గుండె పోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

junk food

junk food

ఇంకా సలాడ్స్ కు కూడా దూరంగా ఉండాలి. షుగర్, సాల్ట్ తో చేసిన సలాడ్స్ జోలికి అస్సలు పోకూడదు. కూరగాయలు, ఆకుకూరలతో చేసిన సలాడ్స్ అయితే ఓకే. షుగర్, ఉప్పుతో తయారు చేసిన సలాడ్స్ వల్ల బీపీ పెరగడంతో పాటు.. అనవసరమైన కొవ్వు ఒంట్లో చేరుతుంది. అలాగే.. సెరీల్స్ ను కూడా తినడం తగ్గించాలి. సెరీల్స్ ను చాలామంది బ్రేక్ ఫాస్ట్ గా తింటుంటారు. వీటిలోనూ షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. వీటికి కూడా సాధ్యమైనంత వరకు దూరంగా ఉండాలి.

ఇంకా పొటాటో చిప్స్, బనానా చిప్స్, ఇంకా నూనెలో వేయించిన అన్ని రకాల చిప్స్, ఇతర పదార్థాలకు దూరంగా ఉండాలి. ఫాస్ట్ ఫుడ్ జోలికి అయితే అస్సలు పోకూడదు. చైనీస్ ఫాస్ట్ ఫుడ్ లో లభించే నూడుల్స్ కానీ… ఫ్రైడ్ రైస్ కానీ… దేన్నీ తినకూడదు. అవి చాలా డేంజర్. గుండెకు అవి ఎంతో చేటు చేస్తాయి. అలాగే.. పిజ్జా, బర్గర్… ఫ్రెంచ్ ఫ్రైస్, ఫ్రైడ్ చికెన్ లాంటి వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఫ్రై చేసిన పదార్థాలను వేటిని కూడా తినకూడదు.

junk food

junk food

చాలామంది చికెన్, మటన్, ఫిష్.. ఇతర మాంసాహారాన్ని ఫ్రిడ్జ్ లో దాచుకొని తింటుంటారు. ఇది ఎంత మాత్రం మంచిది కాదు. అసలు ఫ్రిడ్జ్ లో దాచుకొని.. చాలా రోజుల తర్వాత మాంసాహారాన్ని వండుకొని తినకూడదు. ఎప్పటికప్పుడు ఫ్రెష్ మాంసాన్ని మాత్రమే తినాలి. అలా.. ఫ్రీజ్ చేసిన మాంసాన్ని తింటే… చాలావరకు గుండెజబ్బులు వచ్చే ప్రమాదం ఉంటుంది.

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది