Revanth Reddy : షాకింగ్ నిర్ణయం తీసుకున్న రేవంత్ రెడ్డి? ఈదెబ్బతో టీఆర్ఎస్ దుకాణం బంద్?
Revanth Reddy ప్రస్తుతం దూకుడు మీదున్నారు. తెలంగాణకు ఉన్న ఏకైక దిక్కు రేవంత్ రెడ్డి మాత్రమే. రేవంత్ రెడ్డి లేకుంటే కాంగ్రెస్ పార్టీకి దిక్కు దివానా ఉండేది కాదు. ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి బాగా లేదు. అయినప్పటికీ.. ఎంపీ రేవంత్ రెడ్డి.. పార్టీని పటిష్ఠపరిచేందుకు తన వంతు కృషి చేస్తున్నారు.
అయితే.. తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీనే అయినప్పటికీ.. బీజేపీ దూకుడు ముందు మాత్రం కాంగ్రెస్ ఆటలు సాగడం లేదు. ఇటీవల జరిగిన ఎన్నికల్లోనూ అదే జరిగింది. బీజేపీ పార్టీ విజయదుందుబి మోగించగా… కాంగ్రెస్ పార్టీ మాత్రం మూడో స్థానంతో సరిపెట్టుకుంది.
ఇలాగే ఉంటే.. పార్టీ పరిస్థితి అగమ్యగోచరమే అని అనుకున్న అధిష్ఠానం దిద్దుబాటు చర్యలను ప్రారంభించింది. సీనియర్ నేతలు పార్టీని గాడిలో పెట్టేందుకు తెగ ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తూ కార్యకర్తల్లో జోష్ నింపుతున్నారు.
రేవంత్ రెడ్డికి తెలంగాణ వ్యాప్తంగా విపరీతంగా ఫాలోయింగ్ ఉంది. ఆ ఫాలోయింగ్ ను ఉపయోగించుకొని రేవంత్ రెడ్డి రాష్ట్రమంతా పర్యటిస్తున్నారు. అధికార టీఆర్ఎస్ పార్టీని టార్గెట్ గా చేసుకొని రేవంత్ రెడ్డి దూసుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు.
Revanth Reddy : అచ్చంపేట నుంచి హైదరాబాద్ వరకు పాదయాత్ర
తాజాగా నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటలో జరిగిన రాజీవ్ రైతు భరోసా దీక్షలో పాల్గొన్న రేవంత్ రెడ్డి ఈసందర్భంగా దీక్షకు వచ్చిన రైతులను ఉద్దేశించి ప్రసంగించారు. అయితే.. రేవంత్ రెడ్డి ప్రసంగిస్తుండగా… రేవంత్ రెడ్డి పాదయాత్రం చేయాలంటూ.. దీక్షలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు కోరగా.. రేవంత్ రెడ్డి వెంటనే ఒప్పేసుకొని అక్కడికక్కడే పాదయాత్ర ప్రారంభించారు. అచ్చంపేట నుంచి హైదరాబాద్ వరకు పాదయాత్ర చేస్తూ వెళ్తానంటూ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
అయితే.. కార్యకర్తలు, నాయకులు.. పాదయాత్ర చేయాలంటూ కోరడంతో వెంటనే రేవంత్ రెడ్డి ఒప్పుకొని పాదయాత్రను అక్కడికక్కడే ప్రారంభించడంతో.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు స్వాగతించారు. ఆయన వెంట పాదయాత్రలో పాల్గొనేందుకు వందలాది మంది కార్యకర్తలు, అభిమానులు అచ్చంపేటకు బయలుదేరారు.