7th Pay Commission : దసరా సందర్భంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. మోదీ సర్కార్ భారీ నజరానా
7th Pay Commission : ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు కేంద్రం గుడ్ న్యూస్ త్వరలో చెప్పబోతోంది. లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఈ న్యూస్ కోసం ఎదురు చూస్తున్నారు. దసరా, దీపావళి కానుకగా త్వరలోనే మోదీ సర్కార్ బారీ నజరానా ప్రకటించనుంది. త్వరలో ఉద్యోగులకు డియర్ నెస్ అలవెన్స్ (డీఏ) పెంచనుంది. త్వరలోనే డీఏ పెంపునకు సంబంధించిన బకాయిలు వచ్చే నెల అక్టోబర్ 1 న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ఖాతాల్లో పడనున్నాయి. ప్రస్తుతం డీఏ 34 శాతంగా ఉంది.
మార్చి 2022 లో డీఏ చివరి సారి పెరిగింది. 31 శాతంగా ఉన్న డీఏను 3 శాతం పెంచారు. దీంతో 31 నుంచి 34 శాతానికి డీఏ ఎగబాకింది. ఇప్పుడు మరో 4 శాతం పెంచి.. 38 శాతంగా డీఏను ఫిక్స్ చేయనుంది కేంద్రం. ఈ నెల 28 న ప్రధాని మోదీ అధ్యక్షతన కేబినేట్ సమావేశం జరగనుంది. అప్పుడే డీఏ పెంపునకు సంబంధించిన నిర్ణయం తీసుకొని ప్రకటించే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చే నెల వచ్చే జీతం భారీగా ఉండనుంది. ఏడో వేతన సంఘం సిఫారసుల మేరకే డీఏ పెరగనుంది.
7th Pay Commission : ఏడో వేతన సంఘం సిఫారసుల మేరకే పెరగనున్న డీఏ
ప్రస్తుతం ఏడో వేతన సంఘం సిఫారసులనే ప్రభుత్వం పాటిస్తోందని.. ఎనిమిదో వేతన సంఘం ఇప్పట్లో వచ్చే అవకాశం లేదని కేంద్రం స్పష్టం చేసింది. ఏఐసీపీఐ ఐడబ్ల్యూ నివేదిక ప్రకారం మొదటి ఆరు నెలల డేటాను చూస్తే… ఇండెక్స్ 0.2 పాయింట్లు పెరిగి 129.9 కి చేరింది. కేంద్ర ప్రభుత్వం ఈ ఇండెక్స్ ను ఆధారంగా చేసుకొని డీఏను పెంచుతుంది. ఇండెక్స్ పెరుగుదల ప్రకారం చూస్తే ఈ నెల డీఏ 4 శాతం పెరగనుంది. దీని వల్ల.. లక్షల మంది కేంద్ర ఉద్యోగులు, పెనన్షర్లకు జీతం పెరగనుంది. జులై, ఆగస్టు రెండు నెలల బకాయిలను కలిపి కొత్త డీఏను సెప్టెంబర్ 2022 జీతంతో చెల్లిస్తారు. 38 శాతం డీఏ.. జులై 1, 2022 నుంచి అమలులోకి రానుంది. రెండు నెలల బకాయిలను కలిపితే అక్టోబర్ 1 న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చే జీతం భారీగానే ఉండనుంది.