7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరో గుడ్ న్యూస్.. మరోసారి పెరగనున్న డీఏ.. ఎంతో తెలుసా?
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరో గుడ్ న్యూస్ అందించింది కేంద్రం. దీపావళి సందర్భంగా మరోసారి డీఏ పెంచేందుకు రెడీ అవుతోంది. మరోసారి ఉద్యోగులకు 3 శాతం డీఏ పెంచనున్నారు. అంటే ప్రస్తుతం పెరిగిన 38 శాతానికి మరో 3 శాతం పెరిగి 41 శాతం డీఏ కానుంది. జనవరి 2023 న డీఏ పెంపు అమలులోకి రానుంది. ద్రవ్యోల్బణం దృష్ట్యా ఈసారి మూడు శాతాన్ని కేంద్రం డీఏ పెంచింది. దీని వల్ల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీగా జీతం పెరగనుంది.
ఏఐసీపీఐ ఇండెక్స్ ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏను కేంద్రం పెంచుతోంది. ఆల్ ఇండియా కంజ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ప్రకారం లేబర్ మంత్రిత్వ శాఖ డేటాను రిలీజ్ చేసింది. దేశం మొత్తం మీద 88 సెంటర్లలో ఇండెక్స్ ను తయారు చేశారు. ప్రతి నెల గత నెలకు సంబంధించిన పారిశ్రామిక ద్రవ్యోల్బణాన్ని లేబర్ మంత్రిత్వ శాఖ విడుదల చేస్తుంది. అయితే.. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ 38 శాతంగా ఉంది.
7th Pay Commission : ప్రస్తుతం 38 శాతంగా ఉన్న డీఏ
డీఏ పెంపు కూడా గత జులై నుంచే అమలులోకి వచ్చింది. వచ్చే సంవత్సరానికి సంబంధించిన డీఏ అలవెన్స్ ను వచ్చే జనవరి నుంచి పెంచనుంది. 41 శాతం డీఏ వచ్చే జనవరి నుంచి అమలులోకి రానుంది. 2023 లో తదుపరి డీఏను ప్రకటిస్తారు. జులై 2022 నుంచి డిసెంబర్ 2022 వరకు ద్రవ్యోల్బణాన్ని లెక్కించి డీఏను పెంచుతారు. ఇప్పటికే జులై, ఆగస్టుకు సంబంధించిన ఫిగర్స్ వచ్చాయి. ఈ లెక్కల ప్రకారం వచ్చే సంవత్సరం జనవరిలో 3 శాతం డీఏ పెరగనున్నట్టు తెలుస్తోంది.