Ys Jaganmohan Reddy : ఆ స‌ర్వేలో సీఎం జ‌గ‌న్ రెండేళ్ల పాల‌న ఎలా ఉందంటే..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Ys Jaganmohan Reddy : ఆ స‌ర్వేలో సీఎం జ‌గ‌న్ రెండేళ్ల పాల‌న ఎలా ఉందంటే..?

 Authored By kondalrao | The Telugu News | Updated on :13 June 2021,3:58 pm

Ys Jaganmohan Reddy : 2019 అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు వైఎస్సార్సీపీకి రాష్ట్ర చరిత్రలో కనీ వినీ ఎరగని రీతిలో ఓట్లేసి గెలిపించారు. ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టారు. ఇది జరిగి రెండేళ్లు పూర్తయింది. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ, మున్సిపల్ ఎలక్షన్లలోనూ అధికార పార్టీ వైఎస్సార్సీపీకి అఖండమైన మెజారిటీని కట్టబెట్టారు. దీన్నిబట్టి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఏపీ జనాల్లో ఏమాత్రం క్రేజ్ తగ్గలేదని కళ్లు మూసుకొని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలనపై పబ్లిక్ ఏమనుకుంటున్నారో మరో విధంగా తెలుసుకుందామనే ఉద్దేశంతో డెమొక్రటిక్ రిఫార్మ్స్ అనే సంస్థ నిర్వహించిన ఒక సర్వేలో కూడా ఇదే రకమైన అభిప్రాయాలు వ్యక్తమవటం విశేషం.

పథకాలకు ఆదరణ

వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పగ్గాలను చేపట్టాక నవరత్నాలు పేరుతో చాలా సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రవేశ పెట్టారు. వాటి వల్ల దాదాపు ప్రతి ఇంటికీ లబ్ధి చేకూరుతోంది. అన్ని ప్రాంతాల, అన్ని వర్గాల ప్రజలు సైతం అదే విషయాన్ని సర్వేలో వెల్లడిస్తుండటం గమనార్హం. గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటు, అమ్మఒడి, చేయూత, ఇంటింటికీ రేషన్ సరుకులు, పింఛన్, రైతు భరోసా తదితరఅన్ని స్కీములు బాగున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో మూడు రాజధానులను ఏర్పాటుచేయాలని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తుండటాన్నీ సగం మంది స్వాగతిస్తున్నారు.

ys jaganmohan reddy Two Years Ruling Result in ap

ys jaganmohan reddy Two Years Ruling Result in ap

ప్రతిపక్షాల పరిస్థితేంటి?..: Ys Jaganmohan Reddy

ఏపీలోని మెజారిటీ పీపుల్ రూలింగ్ పార్టీ వైఎస్సార్సీపీ వైపు మొగ్గు చూపుతుండగా తెలుగుదేశం, బీజేపీ, కాంగ్రెస్, జనసేన, లెఫ్ట్ తదితర ప్రతిపక్ష పార్టీలను పట్టించుకున్న నాథుడు లేడని సర్వే వర్గాలు చెబుతున్నాయి. జనం దృష్టిలో పడేందుకు అపొజిషన్ పార్టీలు తలకిందులుగా తపస్సు చేసినా ఫలితం కనిపించట్లేదని పేర్కొంటున్నాయి. రెండేళ్ల కిందట ఎన్నికలు జరిగినప్పుడు విపక్ష పార్టీల పరిస్థితి ఎలా ఉందో ఇప్పటికీ అలాగే  ఉందని స్పష్టం చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా కమలనాథులు, కమ్యూనిస్టులు, కాంగ్రెస్ నాయకులు నానాటికీ తీసికట్టుగా మారుతున్నారని అంటున్నాయి.

వెలువడని పూర్తి వివరాలు

డెమొక్రటిక్ రిఫార్మ్స్ సంస్థ చేస్తున్న ఈ సర్వే ఫలితాలు ఇంకా పూర్తిగా వెలువడలేదు. ఇప్పటివరకు అందిన వివరాల మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, ఆయన పార్టీకి తిరుగులేని అభిమానం ప్రజల నుంచి వెల్లువెత్తుతోంది. టీడీపీ అధ్యక్షుడిగా చంద్రబాబు ఉంటేనే బాగుంటుందని జనం అభిప్రాయపడుతున్నారట. లోకేష్ ని గానీ బాలయ్య బాబుని గానీ ఆ ప్లేస్ లో అంగీకరించబోమని తేల్చిచెబుతున్నట్లు తెలుస్తోంది. జనసేన పార్టీ ప్రెసిడెంట్ గా పవన్ కళ్యాణ్ ని పబ్లిక్ గుర్తు చేసుకుంటున్నారు. కానీ జనసేన పార్టీ ఆఫీసు ఎక్కడ ఉందో, ఆ పార్టీలోని ఇతర నాయకులు ఎవరో తెలియదని నిర్మొహమాటంగా అంటున్నారు.

ఇది కూడా చ‌ద‌వండి ==> Ysrcp : మోడీ కేబినెట్‌లోకి వైసీపీ.. కేంద్ర మంత్రులుగా ఈ ఇద్ద‌రు…?

ఇది కూడా చ‌ద‌వండి ==> Ys Jagan : బై ఎల‌క్ష‌న్స్ బీ రెడీ.. అంటున్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి..?

ఇది కూడా చ‌ద‌వండి ==> Ap – Telangana : ఏపీ, తెలంగాణ మధ్య.. కేంద్రం కొత్త చిచ్చు..!

ఇది కూడా చ‌ద‌వండి ==> TTD CHAIRMAN : వైవీకి ప్ర‌మోష‌న్‌.. టీటీడీ కొత్త చెర్మన్ గా ఎవరు…?

kondalrao

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది