Pawan Kalyan : అన్నంత పని చేశారు.. జనసేన నేతను వైసీపీ నేతలు చంపేశారు.. పవన్ కళ్యాణ్ ట్వీట్ వైరల్
Pawan Kalyan : ఏపీ రాజకీయాలు రోజురోజుకూ వేడెక్కుతున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య గొడవలు తారా స్థాయికి చేరుకుంటున్నాయి. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో నాయకులు అయితే కొట్టుకునే స్థాయి, చంపుకునే స్థాయికి కూడా వెళ్లారు. తాజాగా కావలిలో అదే జరిగింది. ఇప్పటికే అధికార పార్టీ వైసీపీ నేతలు కొందరు పలు ప్రాంతాల్లో సృష్టిస్తున్న విద్వేషాలకు సంబంధించిన వార్తలను చూస్తూనే ఉన్నాం కదా. తాజాగా జనసేన పార్టీ తరుపున ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీ చేసి ప్రణయ్ కుమార్ అనే వ్యక్తిని వైసీపీ నేతలు చంపేశారని చెబుతున్నారు. దీనిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు.
బలికిరి ప్రణయ్ కుమార్ తల్లిని కూడా పరామర్శించారు. నెల్లూరు జిల్లా కావలి మండలం తుమ్మలకుంట అనే గ్రామానికి చెందిన బలికిరి ప్రణయ్ కుమార్ ఇటీవల జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో జనసేన తరుపున పోటీ చేశాడు. అతడు జనసేనకు మద్దతుగా నిలవడమే కాదు.. తన గ్రామంలో ఉన్న సమస్యలపై కూడా ఎప్పటికప్పుడు అధికార పార్టీతో పోరాటం చేస్తుండటంతో పలు సార్లు అధికార పార్టీ నేతల నుంచి బెదిరింపులు వచ్చినట్టు తెలుస్తోంది. అయితే.. ప్రణయ్ అధికార పార్టీపై పోరాటం చేయడం నచ్చని వైసీపీ నేతలు అతడు అడ్డుగా ఉన్నాడని చంపేసినట్టు తెలుస్తోంది.
Pawan Kalyan : బెదిరింపులను లెక్క చేయకుండా అధికార పార్టీపై పోరాటం కొనసాగించిన ప్రణయ్
నా బిడ్డను వైసీపీ వాళ్లు చంపేశారు. ఎవరు చంపారో కూడా ఆ తల్లి పవన్ కళ్యాణ్ కు చెప్పుకుంది. ఇంతకుముందు ఎంపీటీసీగా పోటీ చేసినప్పుడు ప్రణయ్ మాట్లాడిన వీడియో, తాజాగా పవన్ కళ్యాణ్ ప్రణయ్ తల్లితో మాట్లాడిన వీడియోను పవన్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ప్రణయ్ కుమార్ డిగ్రీ చదివి ఆటో నడుపుకునేవారని, కావలి రూరల్ మండలంలోని తుమ్మలపెంట గ్రామంలో ఎంపీటీసీ 1 నుంచి జనసేన తరుపున పోటీ చేశారని చెబుతూ పవన్ ఆ వీడియోను పోస్ట్ చేశారు. ఆ తల్లి వేదనను చూసి సోషల్ మీడియాలో జనసేన అభిమానులు వైసీపీపై మండిపడుతున్నారు. ప్రణయ్ తల్లికి ఆర్థిక సాయం చేసిన పవన్ కళ్యాణ్.. ఆమె బాగోగులను తానే చూసుకుంటానని మాటిచ్చారు.
పేరు: బలికిరి ప్రణయ్ కుమార్, చదువు: డిగ్రీ, కులం: ఎస్సీ (మాల)
తల్లి: వరలక్ష్మి (ఈమె అంగన్వాడీ కార్యకర్త),బలికిరి ప్రణయ్ డిగ్రీ చదివి ఆటో నడుపుకొనేవారు. కావలి రూరల్ మండలంలోని తుమ్మలపెంట గ్రామంలో ఎంపీటీసీ-1 నుంచి జనసేన తరఫున పోటీ చేశారు. pic.twitter.com/yyRVeh18mE— Pawan Kalyan (@PawanKalyan) November 8, 2022