Diabetes Diet Plan : షుగర్ పేషెంట్స్ ఒక్క నెల రోజులు ఇలా చేయండి.. ఆ తర్వాత షుగర్ టాబ్లెట్లను విసిరి పారేస్తారు? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Diabetes Diet Plan : షుగర్ పేషెంట్స్ ఒక్క నెల రోజులు ఇలా చేయండి.. ఆ తర్వాత షుగర్ టాబ్లెట్లను విసిరి పారేస్తారు?

 Authored By jagadesh | The Telugu News | Updated on :1 August 2021,1:15 pm

Diabetes Diet Plan : ప్రపంచం మొత్తాన్నే గడగడలాడిస్తున్న వ్యాధి షుగర్. వయసుతో సంబంధం లేకుండా.. ప్రతి ఒక్కరిని వేధిస్తోంది ఈ వ్యాధి. చిన్న పిల్లలు కూడా షుగర్ వ్యాధికి గురవుతున్నారు అంటే.. షుగర్ వ్యాధి ఎంత డేంజరో అర్థం చేసుకోవచ్చు. షుగర్ ఒక్కసారి వస్తే.. ఇక జీవితాంతం మెడిసిన్ వాడాల్సిందే. షుగర్ ను ఎప్పుడూ అదుపులో ఉంచుకోవాలి. ఏమాత్రం షుగర్ లేవల్స్ పెరిగినా ప్రమాదమే. షుగర్ లేవల్స్ ను కంట్రోల్ లో ఉంచుకోవడంతో పాటు.. నోరును కూడా అదుపులో ఉంచుకోవాలి. లేకపోతే.. లేనిపోని ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి.

diet plan for diabetics patients

diet plan for diabetics patients

షుగర్ లేవల్స్ ఎక్కువైతే.. గుండె జబ్బులు, కీళ్ల నొప్పులు, కిడ్నీ సమస్యలు వస్తుంటాయి. ఓవైపు షుగర్ వ్యాధి.. మరోవైపు ఈ సమస్యలు.. వీటన్నింటితో సతమతమవ్వాల్సివస్తుంది. అందుకే.. షుగర్ ఉన్నవాళ్లు ఒక్క నెలరోజుల పాటు ఈ డైట్ ప్లాన్ ను అమలు చేయండి. ఒక్క నెల అంటే నెల ఖచ్చితంగా ఈ డైట్ ప్లాన్ ను అవలంభిస్తే.. ఆ నెల తర్వాత షుగర్ టాబ్లెట్లను బయట విసిరి పారేయొచ్చు.

Diabetes Diet Plan : ఇంతకీ ఆ డైట్ ప్లాన్ ఏంటి?

డైట్ ప్లాన్ లో భాగంగా.. ఉదయం లేవగానే.. ముందు ఒక లీటరు గోరు వెచ్చని నీళ్లను తాగాలి. ఎక్కువ తాగినా పర్వాలేదు. కానీ.. ఆ పని ఉదయం లేవగానే చేయాలి. లేవగానే గోరువెచ్చని నీళ్లను తాగేస్తే.. ముందు కడుపు శుభ్రం అవుతుంది. ఆ తర్వాత ఒక గంట పాటు వ్యాయామం చేయండి. వ్యాయామం చేశాక.. ముఖం కడుక్కొని.. అన్ని కూరగాయలతో కలిపి చేసిన జ్యూస్ ను తాగండి. సాధారణంగా మనకు మార్కెట్ లో దొరికే ఏ కూరగాయలైనా సరే.. వాటిని తెచ్చుకొని.. చక్కగా కట్ చేసుకొని జ్యూస్ చేసుకొని ఉదయం 8 లోపు తాగేయండి. ఆ జ్యూస్ లో కాసింత తేనె, నిమ్మరసం కలుపుకొని తాగితే ఇంకా బెటర్.

diet plan for diabetics patients

diet plan for diabetics patients

ఆ తర్వాత టిఫిన్ తినండి. టిఫిన్ అంటే దోశ, ఇడ్లీ, వడ సాంబారు కాదు.. ఏవైనా మొలకలు ఓ గుప్పెడు తీసుకోండి. లేదా.. ఏవైనా పండ్లు తినండి. అంతే.. మధ్యాహ్నం వరకు మీరు ఇంకా ఏమీ తినకున్నా పర్వాలేదు. మధ్య మధ్యలో గ్లాస్ మంచినీళ్లు తాగుతూ ఉండండి. మధ్యాహ్నం భోజనంలో.. ఒక పుల్కా తినండి. ఏదైనా కూరగాయలతో చేసిన కూరతో పుల్కా కానీ.. రొట్టె కానీ.. తీసుకోండి. జొన్న లేదా రాగి రొట్టే అయితే బెటర్. ఆకు కూరతో కూడా రొట్టెలను తినొచ్చు. అయితే.. ఆ కూరల్లో ఉప్పు తక్కువగా వేయండి. అంతే.

diet plan for diabetics patients

diet plan for diabetics patients

ఆతర్వాత సాయంత్రం పూట ఆకలేస్తే ఏవైనా డ్రైఫ్రూట్స్ కొన్ని తీసుకోండి. రాత్రిపూట భోజనంలో మాత్రం.. ఏవైనా పండ్లను తీసుకోండి. అది కూడా రాత్రి 7 నుంచి 8 లోపే రాత్రి భోజనం ముగించేయాలి. షుగర్ లేవల్స్ మరీ ఎక్కువగా ఉన్నవాళ్లు.. రాత్రి పూట కేవలం పండ్లు తిని ఉండొచ్చు. ఒకవేళ షుగర్ కంట్రోల్ లో ఉన్నవాళ్లు మాత్రం పండ్లతో పాటు.. ఏదైనా వేరే ఆహారం తీసుకుంటే బెటర్. లేదంటే.. షుగర్ లేవల్స్ ఒక్కసారిగా పడిపోయే ప్రమాదం ఉంటుంది. ఇలా ఒక్క నెలరోజుల పాటు ఈ డైట్ ను పాటిస్తే.. మీరు వద్దన్నా కూడా మీ షుగర్ కంట్రోల్ లో ఉంటుంది. అప్పుడు మీ షుగర్ టాబ్లెట్లను బయటకు విసిరి పారేయొచ్చు.

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది