Health Tips | ఉదయాన్నే తలనొప్పి ఎందుకు వస్తుంది? కారణాలు, పరిష్కారాలు ఇదిగో
Health Tips | తలనొప్పి అనేది చాలా మందిని వేధించే సాధారణ సమస్య. ముఖ్యంగా ఉదయం నిద్రలేచిన వెంటనే తలనొప్పి వస్తే రోజంతా అసహనంగా అనిపిస్తుంది. చాలామంది వెంటనే మందులు తీసుకుంటారు కానీ అసలు కారణం ఏమిటో గుర్తించరు. వైద్యుల ప్రకారం, ఉదయాన్నే తలనొప్పి రావడానికి అనేక కారణాలు ఉండవచ్చు — వాటిని అర్థం చేసుకోవడం సమస్యను తగ్గించే మొదటి అడుగు.
#image_title
నిద్ర సమతుల్యత కీలకం
నిద్ర తక్కువగా పడటం వల్ల ఎలా తలనొప్పి వస్తుందో, అదేవిధంగా అధికంగా నిద్రపోవడం కూడా తలనొప్పికి దారితీస్తుంది. నిద్రలో అంతరాయం, లేట్‌గా నిద్రపోవడం, లేదా రాత్రి మధ్యలో తరచుగా మేల్కొనడం ఇవి మెదడు విశ్రాంతి చక్రాన్ని దెబ్బతీస్తాయి. ఫలితంగా ఉదయాన్నే తలనొప్పి వేధిస్తుంది.
ఒత్తిడి మరియు మానసిక భారం
వైద్యుల ప్రకారం, స్ట్రెస్ లేదా ఆందోళన కూడా ఉదయం తలనొప్పికి ప్రధాన కారణం. ఒత్తిడితో నిద్ర నాణ్యత తగ్గిపోతుంది, మెదడు కణాలు అలసిపోతాయి. దీర్ఘకాలంగా ఇలా కొనసాగితే జ్ఞాపకశక్తి, ఆలోచనా సామర్థ్యం తగ్గడం, మానసిక ఆరోగ్యం దెబ్బతినడం జరుగుతుంది.
డీహైడ్రేషన్ కూడా కారణమే
ఉదయం తలనొప్పి రావడానికి శరీరంలో నీటి కొరత కూడా ఒక ముఖ్యమైన కారణం. రాత్రి నిద్రలో నీరు తాగకపోవడం వల్ల శరీరంలో ద్రవాల స్థాయి తగ్గుతుంది. కాబట్టి ఉదయం లేవగానే ఒక గ్లాసు నీరు తాగడం చాలా అవసరం.
జీవనశైలి మార్పులు అవసరం
రోజంతా తగినంత నీరు తాగడం, సమయానికి నిద్రపోవడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, ఒత్తిడి తగ్గించడం ద్వారా ఈ సమస్యను తగ్గించవచ్చు.