సంతాన సమస్యలను తీర్చే ఈ తీగ గురించి మీకు తెలుసా..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

సంతాన సమస్యలను తీర్చే ఈ తీగ గురించి మీకు తెలుసా..?

 Authored By brahma | The Telugu News | Updated on :30 June 2021,6:00 pm

ఆయుర్వేదం అనేది భారతీయుల మూలల్లోనే ఉంది. కాకపోతే ఈ మధ్య ఇంగ్లీష్ మందులు ఎక్కువగా రావటం, ఆయుర్వేద వైద్యం చేసేవాళ్లు తగ్గిపోవటంతో మన పురాతన వైద్యం కొంచం వెనుక పడిన మాట వాస్తవమే, కానీ ఇప్పుడిప్పుడే మన భారతీయులు ఆయుర్వేదం వైపు మళ్లుతున్నట్లు నివేదికలు చెపుతున్నాయి. దీనితో మన ఆయుర్వేదంలో ఉపయోగించే అనేక రకాలైన మొక్కలను మీకు పరిచయం చేస్తుంది.. ది తెలుగు న్యూస్..

dusara tiga

పైన కనిపిస్తున్న ఆకూ యొక్క శాస్త్రీయనామం కొక్యులస్ హెర్తికాస్.. దీనిని తెలుగులో దూసర తీగ, సిబ్బి తీగ,చిపిరి తీగ అని పిలుస్తారు. సంసృతంలో పాపాల గరిడి అని కూడా పిలుస్తారు.. ఎక్కువగా పొలాల్లో దొరికే ఈ ఆకూ దొండ ఆకులూ మాదిరి ఉంటాయి. ఈ మొక్కను సరైన పద్దతిలో వాడితే అనేక రకాలైన ప్రయోజనాలు ఉన్నాయి. ఈ రోజుల్లో చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరు నరాలు సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. అదే విధంగా శరీరానికి మించిన అధిక వేడి వలన కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి వాటికీ ఈ తీగ ఆకులూ బాగా పనిచేస్తాయి.

వేసవి కాలంలో పిల్లలకు అనేక శరీర సంబంధిత వ్యాధులు వస్తుంటాయి. బయట ఎక్కువగా తిరగటం వలన ఒంట్లో వేడి పెరగటమే కాకుండా, మూత్రం మంటగా రావటం, ముక్కులో నుండి రక్తం కారడం లాంటివి జరుగుతుంటాయి. అదే విధంగా పెద్దవాళ్ళు కూడా ఎండలో తిరగటం, పొలాల్లో పనిచేసి రావటం మూలంగా ఎండదెబ్బ తగిలి మలమూత్రంలో రక్తస్రావం జరిగే అవకాశం ఉంది.

Medicinal herb Patalgarudi / Broom Creeper / Jal-jamni (Cocculus Hirsutus) - bimbima

వీటిని నిరోధించటానికి ఈ తీగ ఆకులూ తీసుకోని శుభ్రంగా కడిగి, కొద్దీ నీటిలో వీటిని వేసి బాగా రసం వచ్చేవరకు నలిపి, ఆ తర్వాత దానిలోని వ్యర్దాలను తీసేసి ఆ రసాన్ని పది పదిహేను నిముషాలు పక్కన పెట్టుకోవాలి. దీనితో అది జెల్ లాగా తయారు అవుతుంది. దానిలో పటిక బెల్లం కానీ తాటి బెల్లం కానీ కలిపి తినాలి. ఇలా తినటం వలన ఎలాంటి ఆరోగ్య సమస్యలైనా తొలిగిపోతాయి. సంతానలేమి సమస్య ఉన్నవాళ్లు ఈ రసం తీసుకోవటం వలన గర్భాశయ సమస్యలు తొలిగిపోయే అవకాశం ఉంది.

ఈ ఆకూ రసాన్ని 90 రోజులు క్రమం తప్పకుండా తీసుకుంటే శరీరంలో ఇన్ బాలన్స్ గా ఉండే హార్మోన్స్ ను సరిచేస్తుంది. నెలసరి సమస్యలు ఉన్నవారికి రెగ్యులర్ అయ్యేందుకు సహాయ పడుతుంది. ఎండాకాలంలో వచ్చే వేడి కురుపులకు ఈ ఆకు రసం తీసుకోవటం వలన మంచి ఫలితం ఉంటుంది. ఇవి ఎక్కువగా అందుబాటులో లేనివాళ్లు, ఈ ఆకులూ ఎప్పుడైనా దొరినప్పుడు, వాటిని నీటిలో కడిగి ఎండబెట్టి, వాటిని పొడిగా చేసుకొని ఒక డబ్బాలో నిల్వ ఉంచుకోవాలి. ఈ పొడిని గోరువెచ్చని నీటిలో కలిపి తీసుకోవచ్చు.

ముఖ్యంగా ఈ ఆకుల్లో కాల్షియం అనేది అధిక మోతాదులో ఉంటుంది. దీనితో ఎముకలు గట్టి పడటం జరుగుతుంది. మోకాళ్ళు నొప్పులు, కీళ్లు నొప్పులు, చిన్న వయసులోనే అరికల మంటలు, ఉదయం నిద్ర లేచిన వెంటనే అడుగు వేయటానికి కూడా కొందరు ఇబ్బంది పడుతారు . అలాంటి వాళ్లందరికీ ఈ ఆకు రసం ఎంతో మేలు చేస్తుంది. పూర్వకాలంలో ఇంటికి చుట్టూ పక్కల చెట్లు అవి ఉండటంతో పాములు ఎక్కువగా వస్తుంటాయి. పాములు ఇతర కీటకాలు రాకుండా ఉండటానికి ఈ ఆకులను ఇంటి ముందు కట్టేవాళ్ళు..
ఇది కూడా చ‌ద‌వండి ==> ఈ మొక్క కనిపిస్తే అస్సలు వదలొద్దు.. ఔషధాల గని ఈ మొక్క.. దీని వల్ల ఎన్ని లాభాలో తెలుసా?

ఇది కూడా చ‌ద‌వండి ==> క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే.. వెంటనే జ్యూస్ చేసుకొని తాగేస్తారు..!

ఇది కూడా చ‌ద‌వండి ==> ఈ మొక్క ఎక్కడైనా కనిపిస్తే అస్సలు వదలకండి.. నేల ఉసిరి వల్ల ఎన్ని లాభాలో తెలుసా?

ఇది కూడా చ‌ద‌వండి ==> ఈ కాయలు కనిపిస్తే అస్సలు వదలకండి.. వీటి గురించి తెలిసి డాక్టర్లే నోరెళ్లబెట్టారు?

Also read

brahma

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది