Bank : డిసెంబర్‌లో బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవులో తెలుసా?
bank : అక్టోబర్, నవంబర్ నెలలతో ఫెస్టివల్ సెలవుల సీజన్ ముగిసిపోయింది. ఇక, ఈ సంవత్సరంలో ఆఖరి నెల డిసెంబర్ మరో నాలుగు రోజుల్లో వచ్చేస్తోంది. ఈ ఏడాదిలో చివరి నెల కావడంతో చాలా మంది బ్యాంకుల లావాదేవీల విషయంపై పూర్తిగా తెలుసుకోవాలని భావిస్తుంటారు. ఇందుకు డిసెంబర్‌లో బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవులు ఉన్నాయో తెలుసుకోవడం అవసరం. దీపావళితో పండుగ సీజన్ అయిపోయింది. డిసెంబర్‌లో క్రిస్మస్ తర్వాత మళ్లీ సంక్రాంతి సెలవుల సీజన్ మొదలవుతుంది. ఈ నేపథ్యంలో 2020 సంవత్సరంలో పూర్తి చేయాల్సిన బ్యాంక్ లావాదేవీలను డిసెంబర్‌లో నెలలో ప్లాన్ చేసుకుంటే వెంటనే అలర్ట్ కండి. ముఖ్యమైన ట్రాన్సాక్షన్స్ ఏవైనా చేయాలనుకుంటున్నారా? అయితే, ఏయే రోజుల్లో బ్యాంకులకు సెలవులు ఉన్నాయో తెలుసుకోండి.
Bank : వర్థంతులు, పండుగలు..
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో డిసెంబర్ నెలలో బ్యాంకులు 6 రోజులు సెలవులు. అదేంటి 4 ఆదివారాలు, నెలలో 2వ శనివారం, నాలుగో శనివారం ఇవే 6 రోజులు అవుతుంది కదా.. మరి క్రిస్మస్ సెలవు ఉంటుంది కదా అనుకుంటున్నారా? అయితే, క్రిస్మస్ సెలవు కూడా నాలుగో శనివారంతో కలిసిపోయింది. దీంతో ఈ నెలలో మొత్తం 6 రోజులే బ్యాంక్‌లకు సెలవు. ఇక ఇతర రాష్ట్రాల్లో డిసెంబర్ 3న సెయింట్ ఫ్రాన్సిస్ సేవియర్ ఫీస్ట్, డిసెంబర్ 18న యు సోసో థామ్ వర్ధంతి, డిసెంబర్ 24న, డిసెంబర్ 27న క్రిస్మస్ సంబరాలు, డిసెంబర్ 30న యు కియాంగ్ నాన్గ్‌బాహ్, డిసెంబర్ 31న కొత్త సంవత్స వేడుకల సందర్భంగా సెలవులు ఉన్నాయి. ఈ సెలవు తెలుగు రాష్ట్రాల్లో వర్తించవు.
అయితే, బ్యాంక్‌లకు సెలవులు ఉన్న రోజు ఖాతాదారులు కొన్ని బ్యాంక్ సేవలను ఉపయోగించుకునే వీలుంది. ఖాతాదారులు నేషన్ ఎలక్ట్రానిక్స్ ఫండ్స్ ట్రాన్స్‌ఫర్(NEFT), రియల్ టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్(RTGS), యూపీఐ, ఆన్‌లైన్ బ్యాంకింగ్ వంటి సేవలు ఉపయోగించుకోవచ్చు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్‌సైట్‌లో బ్యాంకులకు సంబంధించి సెలవు వివరాలు తెలుసుకోవచ్చు. https://www.rbi.org.in/Scripts/HolidayMatrixDisplay.aspx లింక్ క్లిక్ చేస్తే రాష్ట్రాల వారీగా సెలవుల వివరాలు తెలుసుకోవచ్చు. హైదరాబాద్ సర్కిల్ సెలక్ట్ చేసే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో బ్యాంక్ సెలవుల వివరాలు పొందవచ్చు.