Warangal : పంట చేన్లలో డ్రోన్స్.. వరంగల్ జిల్లాలో సరికొత్త ప్రయోగం.. డ్రోన్లతో పిచికారీ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Warangal : పంట చేన్లలో డ్రోన్స్.. వరంగల్ జిల్లాలో సరికొత్త ప్రయోగం.. డ్రోన్లతో పిచికారీ

 Authored By gatla | The Telugu News | Updated on :5 August 2021,12:14 pm

Warangal : వ్యవసాయ రంగంలో రోజురోజుకూ కొత్త కొత్త పద్ధతులు వస్తున్నాయి. విప్లవాత్మకమైన మార్పులు వస్తున్నాయి. పంట చేన్లలో చీడపీడల నివారణ కోసం రైతులు ఇన్ని రోజులు ఎన్నో కష్టాలు పడాల్సి వచ్చేది. అయితే.. పంట చేలల్లో చీడపురుగుల నివారణ కోసం ఉమ్మడి వరంగల్ జిల్లాలోని భూపాలపల్లికి చెందిన ఓ ప్రైవేటు కంపెనీ.. డ్రోన్లను తయారు చేసింది.

drones used in crops to spray chemicals in warangal

drones used in crops to spray chemicals in warangal

డ్రోన్లను ఇప్పటికే పలు రంగాల్లో వాడుతున్నారు. అయితే.. వ్యవసాయం కోసం కూడా డ్రోన్లను ఉపయోగించుకోవచ్చని చెబుతున్నప్పటికీ.. చాలామంది రైతులకు అవగాహన లేక డ్రోన్ల జోలికి వెళ్లడం లేదు. అయితే.. ఎక్కువ ఎకరాల పంట చేన్లలో మందు పిచికారీ చేయాలంటే చాలా సమయం పడుతుంది. కానీ.. డ్రోన్లతో చాలా తక్కువ సమయంలో ఎక్కువ ఎకరాలకు మందును పిచికారీ చేయొచ్చు.

అందుకే.. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో.. భూపాలపల్లి సమీపంలోని కాటారంలో ప్రయోగాత్మకంగా.. రెండు డ్రోన్లతో పురుగు మందుల పిచికారీని ప్రారంభించారు. 200 నుంచి 600 లీటర్ల కెపాసిటీ ఉన్న పురుగుల మందును ఈ డ్రోన్లు పిచికారీ చేయగలవు. కాకపోతే ఈ డ్రోన్లను కొనుగోలు చేయాలంటే 6 లక్షలు పెట్టాలి. అంత డబ్బు పెట్టి.. రైతులు డ్రోన్లను కొనే పరిస్థితి ఉండదు కాబట్టి.. ఎకరానికి 450 రూపాయలు అద్దెతో ఈ డ్రోన్లను తీసుకొని రైతులు పిచికారీ చేసుకోవచ్చని.. కంపెనీ వెల్లడించింది.

gatla

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది