Ys Sharmila : బ్రేకింగ్.. వైఎస్ షర్మిల పార్టీకి లైన్ క్లియర్
Ys Sharmila : వైఎస్ షర్మిల ఏర్పాటు చేసిన రాజకీయ పార్టీకి ఎన్నికల సంఘం ఆమోద ముద్ర వేసింది. వైఎస్సార్ తెలంగాణా ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో షర్మిల మళ్ళీ పాదయాత్రను మొదలుపెట్టేందుకు సిద్దమవుతున్నారు. ఎన్నికల సంఘం ఆమోద ముద్రతో తెలంగాణాలో వైఎస్ షర్మిల పార్టీ పెట్టిన తర్వాత ఎన్నో అనుమానాలకు సమాధానం దొరికింది.
ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా గత ఏడాది చివర్లో పాదయాత్ర ఆపేసిన షర్మిల… మార్చ్ 5 నుంచి పాదయాత్ర మొదలుపెట్టే అవకాశం ఉంది. ఆమె రాజకీయ పార్టీకి ఎన్నికల సంఘం ఆమోద ముద్ర వేస్తుందా లేదా అనేది సందేహంగా మారింది. ఈ తరుణంలో ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆ పార్టీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు.

election commission green signal for ys sharmila party
గత ఏడాది తన అన్నతో వచ్చిన విభేదాలతో తనకంటూ సొంత కుంపటి ఉంటే మంచిది అనే ఆలోచనలో ఆమె రాజకీయ పార్టీని ఏర్పాటు చేసారు. నల్గొండ జిల్లా కొండపాకగూడెం నుంచి షర్మిల పాదయాత్ర మొదలుపెట్టే అవకాశం ఉంది.