EPS New System : పెన్షనర్లకు కేంద్రం గుడ్ న్యూస్.. డైరెక్ట్ గా బ్యాంక్ నుంచి విత్ డ్రా ఫెసిలిటీ..!
ప్రధానాంశాలు:
EPS New System : పెన్షనర్లకు కేంద్రం గుడ్ న్యూస్.. డైరెక్ట్ గా బ్యాంక్ నుంచి విత్ డ్రా ఫెసిలిటీ..!
EPS New System : ఉద్యోగుల పెన్షన్ స్కీం తో పాటు పెన్షనర్లకు గుడ్ న్యూస్ చెప్పింది కేంద్రం. 2025 జనవరి 1 నుంచి కొత్త పెన్షన్ విధానాన్ని ప్రవేశ పెడుతున్నారు. దీనితో డైరెక్ట్ గా బ్యాంక్ నుంచి పెన్షన్ ని తీసుకునే అవకాశం ఇస్తున్నారు. ఇది EPF సభ్యులకు చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫడ్ ఆర్గనైజేషన్ (EPFO) పెన్షన్ యాక్సెస్ విధానం తో ఈ మార్పులను దేశవ్యాప్తంగా సుమారు 78 లక్షల మని పెన్షనర్లపై ప్రభావం చూపుస్తుంది. పెన్షనర్లకు, ఈ.పి.ఎఫ్ ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించే క్రమంలో ఈ.పి.ఎఫ్.ఓ విధానాలను అప్డేట్ చేశారు. ఈ క్రమంలో పెన్షనర్లు తమ నెలవారీ పెన్షన్ ను ఏ బ్యాంక్ నుంచైనా పొందవచ్చు. అంతేకాఉ పి.ఎఫ్ శాఖ నుంచి కూడా తీసుకునే విధంగా కేంద్రం అమోదించింది. సెంట్రలైజ్డ్ పేమెంట్ సిస్టెం గా పిలిచే ఈ కొత్త సిస్టం జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుంది.
EPS New System ప్రైవేట్ రంగ ఉద్యోగులకు..
దీని వల్ల ప్రైవేట్ రంగ ఉద్యోగులకు పెన్షన్ యాక్సెస్ మెరుగు పడే అవకాశం ఉంటుంది. పెన్షనర్లు తమ డబ్బు పొందేందుకు కేవలం కొన్ని నిర్ధిష్ట శాఖలకే వెళ్లాల్సి వతుంది. అందుకే ఈ.పి.ఎస్ సభ్యులకు ఈ అవకాశాన్ని ఇస్తున్నారు. కేంద్ర మంత్రి డాక్టర్ మున్సుఖ్ మాండవియా రీసెంట్ గా ఈ కొత్త పెన్షన్ ప్రాముఖ్యతను చెప్పారు. దేశవ్యాప్తంగా ఈ మార్పులు పెన్షనర్లకు పేమెంట్స్ సులభతరం చేయనున్నాయి.
అంతేకాదు పెన్ష పంపిణీ సంక్లిష్టత తగ్గించేలా దీన్ని సిద్ధం చేశారు. 1995 ఉద్యోగుల పెన్షన్ పథకం కింద లబ్దిదారులు పెన్షన్ పంపిణీ సున్నితంగా వేగవంతా చేయాల్సి ఉంది. ఐతే కొత్త విధానం వల్ల పెన్షన్ నెల వారి చెల్లింపు వారి బ్యాంక్ ఖాతాలోకే వచ్చేస్తాయి. ఈ కొత్త పెన్షన్ సిస్టం వల్ల చాలామంది దూర ప్రాంతాలకు వెళ్లి పెన్షన్ కోసం ఎదురుచూసే అవసరం ఉండదు.