KCR : బిగ్ న్యూస్.. ఈటల రాజేందర్ తో సీఎం కేసీఆర్ భేటీ.. ?
Etela Rajender : ప్రస్తుతం తెలంగాణ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి ఈటల రాజేందర్ కు అస్సలు పడటం లేదు. మంత్రి వర్గం నుంచే ఈటలను కేసీఆర్ తొలగించారు. బర్తరఫ్ చేశారు. దీంతో టీఆర్ఎస్ పార్టీతో ఈటల రాజేందర్ తెగదెంపులు చేసుకున్నారు. పార్టీకి, తన ఎమ్మెల్యే పదవికి ఇంకా రాజీనామా చేయలేదు కానీ.. త్వరలోనే తన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసి ఉపఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేయాలని ఈటల రాజేందర్ భావిస్తున్నారని తెలుస్తోంది. అయితే.. రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరూ ఊహించలేరు.

etela rajender to meet telangana cm kcr
ప్రస్తుతం ఈటల విషయం తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. ఉద్యమ కాలం నుంచి కేసీఆర్ వెన్నంటే ఉన్న నేతను ఇలా సీఎం కేసీఆర్ నిర్దాక్షిణ్యంగా వ్యవహరించి మంత్రి వర్గం నుంచి తొలగించడం కరెక్టేనా? అంటూ కొందరు ప్రశ్నిస్తున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ కూడా పునరాలోచనలో పడ్డారట. ఈటల రాజేందర్ విషయంలో సీఎం కేసీఆర్ మనసు మార్చుకునే అవకాశాలు కూడా ఉన్నాయంటూ వార్తలు వస్తున్నాయి. నిజానికి ఇద్దరూ మంచి సన్నిహితులు. కాకపోతే.. ఈటలకు, కేసీఆర్ కు కొన్ని అభిప్రాయ భేదాలు వచ్చి ఇద్దరి మధ్య కాస్త దూరం పెరిగింది. అలాగే అది కంటిన్యూ అయి ఇదిగో ఇంత దూరం వచ్చింది.
Etela Rajender : ఈటల రాజేందర్ ను కేసీఆర్ మళ్లీ దగ్గరికి తీస్తారా?

etela rajender to meet telangana cm kcr
ఏది ఏమైనా.. ఈటల రాజేందర్ విషయంలో సీఎం కేసీఆర్ తొందరపడి ఒక టప్పటడుగు వేశారని.. ఇప్పటికైనా మించి పోయింది ఏం లేదని.. వెంటనే ఈటలను దగ్గరికి తీసుకుంటేనే సీఎం కేసీఆర్ కు కానీ.. పార్టీకి కానీ మంచిదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అదే కరీంనగర్ జిల్లాకు చెందిన మంత్రి గంగుల కమలాకర్ లాంటి వాళ్లు ఈటలను విమర్శించడం వల్ల.. పార్టీకి నష్టం తప్పితే లాభం ఏం లేదంటున్నారు. ఎందుకంటే.. మంత్రి గంగుల కమలాకర్.. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తి కాదు. కానీ.. ఈటల ఉద్యమ సమయం నుంచి ఉన్న వ్యక్తి. అటువంటి ఈటలపై గంగుల కమలాకర్ విమర్శలు చేయడం ఎంత వరకు కరెక్ట్ అని అంటున్నారు. అందుకే.. సీఎం కేసీఆర్ ఇవన్నీ గమనించి.. ఈటలను దగ్గరకు చేర్చుకుంటేనే బెటర్ అంటున్నారు. అయితే.. ఈటల రాజేందర్ తో కేసీఆర్ త్వరలోనే భేటీ కూడా అవుతారనే వార్తలు వస్తున్నాయి. చూద్దాం మరి.. కేసీఆర్.. ఎప్పుడు ఈటలతో భేటీ అవుతారో?