Exit Polls : ఎగ్జిట్ పోల్స్ 2022.. ఏ రాష్ట్రంలో ఎవరిది హవా తేలిపోయింది
Exit Polls : దేశ వ్యాప్తంగా అత్యంత ఆసక్తిని రేకెత్తించిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు నిన్నటితో పూర్తి అయిన విషయం తెలిసిందే. సుదీర్ఘంగా సాగిన ఈ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ పూర్తి అవడం తో అంత రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలో ఎన్నికలు ముగిసిన వెంటనే మీడియా సంస్థలు తమ ఎగ్జిట్ ఎగ్జిట్ పోల్ ఫలితాలు విడుదల చేయడం జరిగింది. అందరి దృష్టి కూడా ఉత్తర ప్రదేశ్ మరియు పంజాబ్ ల పైనే ఉంది. ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఖాయం అంటూ దాదాపు అన్ని మీడియా సంస్థలు కూడా తెలియజేస్తున్నాయి.ఇక పంజాబ్లో ప్రధాన పార్టీల మధ్య హోరా హోరీ తప్పదన్నట్లు గా ఎన్నికలు జరిగాయి. కానీ ఎగ్జిట్ పోల్ లో మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీ అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మెజార్టీ స్థానాలను దక్కించుకుంటుందని అంటున్నారు.
ఈసారి అసెంబ్లీ ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీ ఎక్కడ లేకపోయింది. పై పెచ్చు తాము అధికారం లో ఉన్న రాష్ట్రాన్ని కూడా పోగొట్టుకొంది అంటూ టాక్ వినిపిస్తుంది. దేశ వ్యాప్తంగా మరో రెండున్నర ఏళ్లలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికలను ఇవి కచ్చితంగా ప్రభావం చూపిస్తాయని ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు అభిప్రాయం వ్యక్తం చేశారు.బీజేపీకి కచ్చితంగా ఈ ఎన్నికల్లో తీవ్ర పరాభవం తప్పదు అని అంతా అనుకున్నారు. ఉత్తరప్రదేశ్లో సమాజ్వాది పార్టీ తమ సీట్లను పెంచుకున్నట్లు కనిపించినా ఆ పార్టీకి అధికారం దక్కే అవకాశం మాత్రం లేదు. బీజేపీకి గతంతో పోలిస్తే కొన్ని సీట్లు తగ్గే అవకాశాలు ఉన్నాయి అయినా కూడా యోగి ఆదిత్యనాథ్ సీఎం గా కూర్చోవడం ఖాయమంటూ ఎగ్జిట్ పోల్ ఫలితాలు తెలియజేస్తున్నాయి. పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ జెండా ఎగరవేయడం ఖాయమైంది.
ఇప్పటికే ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్ లో కూడా తమ ప్రభుత్వం ఏర్పాటు చేయబడుతుంది. ఇక గోవాలో హంగ్ ఏర్పడే అవకాశం ఉందని ఎక్కువ మీడియా సంస్థలు తమ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడించాయి. ఉత్తరాఖండ్లో కాంగ్రెస్ మరియు బీజేపీ మధ్య టఫ్ ఫైట్ జరిగే అవకాశం ఉంది. అక్కడ కూడా హంగ్ ఏర్పడే అవకాశాలు లేకపోలేదు. మణిపూర్లో మాత్రం బీజేపీకి ముగ్గు ఉంటుందని మీడియా సంస్థలు తెలియజేస్తున్నాయి. మొత్తం ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో సంచలన ఫలితాలు నమోదు కావడం లేదు కానీ బిజెపి తగ్గలేదు కాస్త అటూ ఇటూ అన్నట్లుగా మాత్రం ఫలితాలు కనిపిస్తున్నాయి. పూర్తి ఫలితాలు మరో రెండు రోజుల్లో రాబోతున్న విషయం తెలిసిందే.