Ganta srinivasarao : గంటా శ్రీనివాస రావు సైలెంట్.. చంద్రబాబు నాయుడు సీరియస్.. కారణం అదేనా..?
Ganta srinivasarao : టీడీపీ సీనియర్ లీడర్ గంటా శ్రీనివాస రావు వేరే పార్టీలో చేరబోతున్నట్టు చాలా సార్లు రూమర్స్ వచ్చాయి. ప్రస్తుత పరిస్థితి సైతం అలాగే కనిపిస్తుంది. ఇంతకు ఆయన టీడీపీలో ఉన్నారా? లేరా? అనే కామెంట్స్ సైతం వినిపిస్తున్నాయి. ఆయనను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దూరం పెట్టారని టాక్. గంట శ్రీనివాస రావు లాంటి నేతలు తన పార్టీకి అవసరం లేదని చంద్రబాబునాయుడు అనుకుంటున్నారట. పార్టీని పట్టించుకోకపోవడం, అధిష్ఠానం అంటే లెక్కచేయడకుండా వ్యవహరించే వారిని ఉపేక్షించబోమని చంద్రబాబు నాయుడు ఇప్పటికే పలు ఇండికేషన్స్ సైతం ఇచ్చారు.2019 ఎలక్షన్స్‌లో విశాఖ ఉత్తర కాన్సిటెన్సీ నుంచి గంటా శ్రీనివాసరావు టీడీపీ తరపున విజయం సాధించారు. ఇక ఏపీలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాలేదు.
దీంతో ఆయన తన కాన్సిటెన్సీకి దూరంగా ఉంటున్నారు. ఆయన మేనల్లుడికి కాన్సిటెన్సీ ఇన్‌చార్జిగా బాధ్యతలు అప్పగించి దాదాపుగా పాలిటిక్స్‌కు దూరమయ్యారు గంటా. చాలా సార్లు ఆయన టీడీపీ నుంచి వేరే పార్టీలో చేరనున్నట్టు రూమర్స్ వచ్చాయి. కానీ వాటి పట్ల ఆయన స్పందించడం లేదు. ఫైనల్‌గా ఆయన తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతారా? లేక వేరే పార్టీలో చేరతారా అన్నది సస్పెన్స్.గంటా శ్రీనివాసరావు కొద్ది రోజులుగా టీడీపీకి దూరంగా ఉండటంతో చంద్రబాబు ఆయనపై సీరియస్‌గా ఉన్నారని తెలుస్తోంది. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో పదవులను అనుభవించి.. పార్టీ కష్టంలో ఉన్న టైంలో దూరంగా ఉండటంతో గంటాపై చంద్రబాబు నాయుడు కోపంగానే ఉన్నారని తెలుస్తోంది.
Ganta srinivasarao : పదవి కోసమేనా..?
తాజాగా చంద్రబాబు నాయకుడు చేపట్టిన దీక్షకు సైతం ఆయన సపోర్ట్ చేయలేదు. పార్టీ కేంద్ర కార్యాలయానికి సైతం హాజరుకాలేదు. పీఏసీ చైర్మన్‌గా పదవికి సంబంధించి పేరును వెల్లడించనంత వరకు ఆ పదవిపై గంటా ఆశలు పెట్టుకున్నారని టాక్. ఆ పదవిని పయ్యావుల కేశవ్‌ను ఇవ్వడంతో.. అప్పటి నుంచి గంటా.. టీడీపీకి దూరంగానే ఉంటున్నారు. తన పై ఎన్ని రూమర్స్ వచ్చినా సైలెంట్‌గానే ఉంటున్నారు. అసెంబ్లీ సెషన్స్‌లోనూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పడం లేదు. దీంతో గంటా తీరుతో అసహనానికి గురైన చంద్రబాబు నాయుడు.. గంటాను పూర్తిగా పక్కన పెట్టేశారని పొలిటికల్ టాక్.