Today Gold Rates : స్వల్పంగా పెరిగిన బంగారం రేట్లు.. నేటి ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
Today Gold Rates : ఒమిక్రాన్ వైరస్ వెలుగు చూసిన తర్వాత దేశంలో బంగారం ధర పెద్దగా పెరగడం లేదు. డిసెంబర్ 23 ఒక్క రోజే బంగారం ధరలో పెరుగుదల కనిపించింది. కానీ మిగతా రోజుల్లో ధర తగ్గడం లేదా స్థిరంగా కొనసాగుతుండడం కనిపించింది. ఇదిలా ఉంటే తాజాగా సోమవారం బంగారం ధరల్లో కాస్త పెరుగుదల కనిపించింది. దేశంలోని పలు ప్రధాన నగరాల్లో సోమవారం బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఓసారి చూసేయండి.
దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 10 రూపాయలు పెరిగి, రూ.47, 510 ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.51,810గా ఉంది. ఇక తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో కూడా బంగారం ధర రూ. 10 పెరిగింది. ఇక్కడ నేడు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.45, 360 ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.49,490గా ఉంది.

Gold rates are steady in Hyderabad Today
విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,360 ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,490గా ఉంది. ఒమిక్రాన్ భయాందోళనలు బంగారం ధరలపై ప్రభావం చూపిస్తున్నాయి. ఈ క్రమంలోనే బంగారం స్థిరంగా కొనసాగుతున్నాయి.