Loans : భార్య పేరుపై రుణాలు తీసుకున్న వారికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త… వడ్డీ పై భారీ రాయితీ…!
Loans : పెళ్లి చేసుకున్న తర్వాత మీ భార్య పేరు మీదగా ఆర్థిక ప్రయోజనాలను పొందవచ్చు అని ఎప్పుడైనా ఆలోచించారా…? అవును మీరు వింటున్నది నిజమే. పెళ్లయిన తర్వాత సామాజిక బాధ్యత కాకుండా మీ భార్య పేరు మీదగా మీరు అనేక రకాల ప్రయోజనాలను పొందవచ్చు. మరి ఆ ప్రయోజనాలు ఏంటి…?దాని గురించి పూర్తి సమాచారం ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Loans : భార్యవిద్యా రుణం పై రాయితీ
చాలామంది అమ్మాయిలకు పెళ్లి అయిన తర్వాత కూడా చదువుకోవాలనే కోరిక ఉంటుంది. కానీ పెళ్లయిన తర్వాత చదువుల కోసం డబ్బు అవసరం. అలాంటప్పుడు ఆమె పేరు మీదుగా ఎడ్యుకేషన్ లోన్ తీసుకున్నట్లయితే దానిలో భారీ రాయితీ పొందే అవకాశం కల్పించింది రుణ శాఖ.అంటే భార్య చదువు కోసం బ్యాంకు నుంచి రుణం తీసుకున్నట్లయితే వారికి భారీ రాయితీ లభిస్తుంది. అయితే ప్రస్తుత కాలంలో బ్యాంకులలో వడ్డీ రేట్లు ఏ విధంగా పెంచారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరి ముఖ్యంగా కొన్ని రకాల రుణాలు దీర్ఘకాలిక రుణాలు అవడంతో తిరిగి చెల్లించాల్సిన వడ్డీ చాలా ఎక్కువగా ఉంటుంది.
కానీ ఇప్పుడు మీ భార్య పై చదువు కోసం డబ్బు తీసుకున్నట్లయితే విద్యా రుణంపై చెల్లించబడి మినహాయింపు పొందుతారు. అయితే ఇది ఇన్కమ్ టాక్స్ రూల్స్ నిబంధనలోని సెక్షన్ 80 ప్రకారం పేర్కొనడం జరిగింది. ఇక ఈ లోన్ పై మీరు దాదాపు 8 సంవత్సరాల వరకు వడ్డీ పై పన్ను క్లెయిమ్ చేయవచ్చు. కానీ మీరు ఈ విద్యా రుణాన్ని ప్రముఖ బ్యాంకులో లేదా ప్రభుత్వం ఆమోదించిన ఆర్థిక సంస్థల నుండి మాత్రమే పొందుతారు. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవాలి అంటే మీ సమీపంలో గల బ్యాంక్ అధికారులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. అంతేకాక బ్యాంకింగ్ వ్యవస్థలో భార్య పేరు మీదుగా రుణాలను తీసుకోవడం వలన అనేక రకాల ప్రయోజనాలను పొందవచ్చు.