Good News : ఇల్లు కొనాలనుకుంటున్నారా? అయితే మీకు ఒక శుభవార్త.. ఇక రూ.12 లక్షల వరకు… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Good News : ఇల్లు కొనాలనుకుంటున్నారా? అయితే మీకు ఒక శుభవార్త.. ఇక రూ.12 లక్షల వరకు…

 Authored By aruna | The Telugu News | Updated on :10 August 2022,7:30 am

Good News : కొత్త ఇల్లు కట్టుకోవాలనుకునేవారికి పీఎన్ బీ హౌసింగ్ ఫైనాన్స్ తాజాగా హోమ్ లోన్ తీసుకునే వారికి తీపి కబురు చెప్పింది. ఉన్నతి లోన్ పోర్ట్ ఫోలియోను సవరించింది. ఆఫర్డబుల్ హౌసింగ్ విభాగంలో ఎక్కువమంది కస్టమర్లకు చేరువ కావాలనే లక్ష్యంతో పోర్ట్ ఫోలియో కింద అందించే రుణాలను మరింత ఆకర్షణీయంగా మార్చింది. ఇకపై ఈ తరహా లోన్స్ కింద అర్హత కలిగిన కస్టమర్లు 9 లక్షల నుంచి 12 లక్షల వరకు రుణాలను పొందవచ్చు. ప్రముఖ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలో ఒకటైన పిఎన్ బీ హౌసింగ్ ఫైనాన్స్ తాజాగా ఉన్నతి పోర్ట్ పోలియో కింద స్మాల్ వెర్టికల్ ను జతచేసింది.

ప్రస్తుతం పిఎన్బి హౌసింగ్ సంస్థ కస్టమర్లకు ఈ భాగం కింద 18 నుంచి 19 లక్షల వరకు రుణాలు అందించనుంది. ఈ సంస్థ అమలు చేసిన స్మాల్ వెర్టికల్ కింద కస్టమర్లు 9 నుంచి 12 లక్షల వరకు రుణం కూడా పొందవచ్చు.ఆఫర్డబుల్ హౌసింగ్ లోన్ విభాగంలో అధిక మార్కెట్ వాటా లక్ష్యంతో ఈ కంపెనీ నిర్ణయం తీసుకుంది. జూన్ త్రైమాసికం లో ఇప్పటికే 10కి పైగా బ్రాంచ్లను ఓపెన్ చేశామని కంపెనీ అండి సీఈవో హర్ దయాల్ ప్రసాద్ తెలిపారు. ఉన్నతి పోర్ట్ ఫోలియోను పూర్తిగా సవరించామన్నారు. లోన్ అమౌంట్ సైజ్ 9 నుంచి 12 లక్షల వరకు ఉంటుందని పేర్కొన్నారు.

Good News Housing finance offers affordable loans of rs 12 kakhs

Good News Housing finance offers affordable loans of rs 12 kakhs

మార్చి ట్రైమాసికంలో కూడా 20 బ్రాంచ్ లను ఓపెన్ చేసామని తెలిపారు. సెప్టెంబర్ నుంచి ఉన్నతి పోర్ట్ ఫోలియో కింద కొత్తగా అందుబాటులోకి తీసుకువచ్చిన రుణ విభాగంలో పెరుగుదల నమోదు కావచ్చు అని తెలిపారు. అతిపెద్ద హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలో ఒకటిగా కొనసాగుతూ వస్తున్న తమకు చిన్న మొత్తంలో కూడా రుణాలు అందించడం ముఖ్యమేనా అని ఆయన వెల్లడించారు. అన్ని వర్గాల వారికి రుణాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పంజాబ్ నేషనల్ బ్యాంకుకు చెందిన పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ ఉన్నతి విభాగం కింద దాదాపు 140 జిల్లాల్లో కార్యకలాపాలనిపిస్తుంది. అది 12 రాష్ట్రాల్లో సేవలు అందుబాటులో ఉండేలా చూస్తామని ఆయన పేర్కొన్నారు.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది