7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఒకేసారి 3 బెనిఫిట్స్.. ఒక్కసారిగా పెరగనున్న జీతం
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం మరోసారి గుడ్ న్యూస్ చెప్పింది. వచ్చే నెల అంటే సెప్టెంబర్ వాళ్లకు పండుగ నెల అని కూడా చెప్పుకోవచ్చు. ఒకే నెలలో కేంద్రం వాళ్లకు మూడు కానుకలు అందించే అవకాశం ఉంది. డీఏ పెంపుతో పాటు డీఏ బకాయిల చెల్లింపు, పీఎఫ్ వడ్డీ ఇలా.. మూడు బెనిఫిట్స్ ఒకే సారి సెప్టెంబర్ నెలలో రానున్నాయి. సెప్టెంబర్ నెలలోనే ఉద్యోగులకు ఈ బెనిఫిట్స్ అందడం వల్ల జీతాలు ఒక్కసారిగా పెరగనున్నాయి.
ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ 34 శాతంగా ఉంది. ప్రతి సంవత్సరం రెండు సార్లు కేంద్రం.. ఏడో వేతన సంఘం సిఫారసుల మేరకు డీఏను పెంచుతూ ఉంటుంది. ఈ సంవత్సరం మార్చిలోనే కేంద్రం తొలి డీఏను ప్రకటించింది. రెండో డీఏను ఇంకా కేంద్రం ప్రకటించలేదు. ఆగస్టు నెల ముగిసిపోతుండటంతో సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లో సెకండ్ డీఏ పెంపు ఉంటుందని తెలుస్తోంది.ప్రస్తుతం ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ (ఏఐసీపీఐ) గత జూన్ నెలలో 129.2 పాయింట్లుగా ఉంది. ఏఐసీపీఐ ప్రకారం.. డీఏ 4 శాతం పెంపునకు ఏడో వేతన సంఘం సిఫారసు చేసినట్టు సమాచారం.
7th Pay Commission : సెప్టెంబర్ లో డీఏ ఎంత పెరగనుంది?
ప్రస్తుతం ఉన్న 34 శాతానికి మరో 4 శాతం కలిపితే వచ్చే నెలలో 38 శాతం డీఏ పెరగనుంది. అలాగే కరోనా సమయంలో 18 నెలల డీఏ పెండింగ్ లో ఉన్న విషయం తెలిసిందే. 18 నెలల డీఏ బకాయిలు అంటే మే 2020 నుంచి జూన్ 2021 వరకు డీఏను కేంద్రం నిలిపివేసింది. వాటి బకాయిలు మొత్తం సెప్టెంబర్ లోనే కేంద్ర ఉద్యోగుల ఖాతాలో జమ అయ్యే అవకాశం ఉంది.
అలాగే.. పీఎఫ్ పై 2021 – 22 కు వడ్డీ రేటును 8.10 గా నిర్ణయించారు. ఈ వడ్డీ కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో సెప్టెంబర్ లో ఉద్యోగుల పీఎఫ్ ఖాతాల్లో జమ కానుంది. అంటే ఒకే నెలలో డీఏ పెంపు, డీఏ బకాయిలు, పీఎఫ్ వడ్డీ.. ఇవన్నీ ఉద్యోగుల ఖాతాల్లో పడటంతో ఒక్కసారిగా భారీ మొత్తంలో ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు పెరగనున్నాయి.