Google Play Store : ప్లే స్టోర్ లో మాల్ వేర్ యాప్స్.. తొలగించిన గూగుల్.. మీ ఫోన్ లో ఉంటే వెంటనే డిలీట్ చేయండి
Google Play Store: ప్రస్తుత కాలంలో స్మార్ట్ ఫోన్ల వాడకం పెరిగిపోయింది. వయసుతో సంబంధం లేకుండా అందరూ వాడుతున్నారు. ఈ మధ్యకాలంలో ఆన్ లైన్ క్లాసుల పేరుతో చిన్నపిల్లలు ఎక్కువగా ఫోన్ యూస్ చేస్తున్నారు. అయితే ఏదైనా యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలంటే గూగుల్ ప్లే స్టోర్ కు వెళ్లాల్సిందే. ఈ క్రమంలో గూగుల్ ప్లే స్టోర్ లో రకరకాల యాప్ప్ డౌన్ లోడ్ చేస్తుంటారు. అయితే అందులో ఉండే యాప్స్ కూడా అంత సురక్షితం కాదని రీసెర్చర్స్ చెబుతున్నారు. అందుకే ఇటీవల డజనుకు పైగా యాప్స్ ను దాని ప్లే స్టోర్ నుంచి గూగుల్ తొలగించింది. ప్రస్తుతం ఇందులో కొన్ని యాప్స్ ప్రమాదకరమని గూగుల్ తేల్చింది.
వెంటనే ఈ యాప్స్ ని నిషేదించింది. సైబర్ నేరగాళ్లు మాల్ వేర్ యాప్ లతో ఇతర యాప్స్ లలోని సమాచారాన్ని సేకరిస్తున్నట్లు తేలడంతో గూగుల్ తాజాగా ఐదు యాప్స్ ని తొలగించింది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం… కాగా పీఐపీ పిక్ కెమెరా ఫొటో ఎడిటర్ యాప్ ఇమేజ్ ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్ కలిగి ఉంటుంది. ఇందులోని మాల్‌వేర్ ఫేస్‌బుక్ లాగిన్ వివరాలను సేకరిస్తుందంట. దీనిని పది లక్షల మందికి పైగా డౌన్‌లోడ్ చేసుకున్నట్లు చెబుతున్నారు. వైల్డ్ అండ్ ఎక్సోటిక్ యానిమల్ వాల్‌పేపర్ యాప్‌లో మాస్క్వెరేడింగ్ అనే యాడ్‌వేర్ ఉంటుంది. ఇది మొబైల్‌లోని ఇతర యాప్‌ల ఐకాన్‌ను, పేరును మారుస్తుందని చెబుతున్నారు. ఈ యాప్‌ను ఇప్పటికే 5 లక్షల మందికి పైగా డౌన్‌లోడ్ చేసుకున్నారట.
Google Play Store : ఈ యాప్స్ ఉన్నాయేమో చెక్ చేసుకోండి..
అలాగే ఫార్చ్యూన్ ఫైండర్ యాప్ ద్వారా స్మార్ట్ ఫోన్‌లోకి ప్రవేశించిన మాల్‌వేర్ ఫేస్‌బుక్ ఖాతా వివరాలను దొంగిలిస్తుందట. దీన్ని కూడా 5 లక్షల మందికి పైగా డౌన్‌లోడ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. కెమెరాను మరింత మెరుగ్గా వినియోగించుకునేందుకు పీఐపీ కెమెరా యాప్‌ను వాడుతుంటారు. ఈ యాప్‌ను ఉపయోగించడం ప్రారంభించగానే అందులోని మాల్‌వేర్ ద్వారా ఫేస్‌బుక్ సమాచారాన్ని సైబర్ నేరగాళ్లకు అందిస్తోందని సమాచారం. ఈ యాప్‌ను ఇప్పటికే 50 వేల మందికి పైగా డౌన్‌లోడ్ చేసుకున్నట్లు సమాచారం. మ్యాగ్నిఫిషర్ ప్లాష్‌లైట్ యాప్‌లో వీడియో, స్టాటిక్ బ్యానర్ యాడ్స్ ఎక్కువగా వస్తాయి. సైబర్ నేరగాళ్లు వీటి నుంచి యాడ్‌వేర్‌ను ఫోన్‌లోకి పంపి డేటాను సేకరిస్తున్నట్లు సమాచారం. దీనిని 10 వేల మందికిపైగా డౌన్‌లోడ్ చేసుకున్నట్లు చెబుతున్నారు.