Postal Department Jobs : నిరుద్యోగుల‌కు గుడ్ న్యూస్‌.. పోస్టల్ డిపార్ట్మెంట్ లో పరీక్ష లేకుండా ప్రభుత్వ ఉద్యోగాలు..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Postal Department Jobs : నిరుద్యోగుల‌కు గుడ్ న్యూస్‌.. పోస్టల్ డిపార్ట్మెంట్ లో పరీక్ష లేకుండా ప్రభుత్వ ఉద్యోగాలు..!!

 Authored By sekhar | The Telugu News | Updated on :19 December 2022,6:30 pm

Postal Department Jobs : ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఖాళీగా ఉన్న పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ తాజాగా రిలీజ్ అయింది. గ్రూప్ ఫోర్ లో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. విద్యార్హత పదవ తరగతి ఉత్తీర్ణత సాధిస్తే చాలు. ఎటువంటి రాత పరీక్ష లేకుండానే ప్రభుత్వ ఉద్యోగంలో జాయిన్ అయిపోవచ్చు. అయితే ఈ పోస్టల్ శాఖ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు యొక్క పదవ తరగతి మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ జరగనుంది. రెండు తెలుగు రాష్ట్రాలలో ఉండే అభ్యర్థులు పదవ తరగతి ఉత్తీర్ణులైన వారు  ఈ పోస్టల్ శాఖలో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు చేసుకునే విధానం చూస్తే… పోస్టల్ శాఖ అధికారిక వెబ్ సైట్ నుండి …. అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకోవాలి. ఆఫ్లైన్ విధానంలోనే అభ్యర్థులు… దరఖాస్తు చేసుకుని… ఫారం లో అన్ని వివరాలను నమోదు చేసి తగిన ధ్రువపత్రాలను జత చేయాలి. ఇక ఇదే సందర్భంలో ఫీజు చెల్లించి… విద్యార్హత సర్టిఫికెట్ల జిరాక్స్ పత్రాలను జత చేసి ది మేనేజర్, మెయిల్ మోటార్ సర్వీస్, బెంగళూరు అడ్రస్ కు పంపించాల్సి ఉంటుంది. దరఖాస్తుల ప్రక్రియ డిసెంబర్ 08, 2022 నుంచి ప్రారంభం అయింది.దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీగా డిసెంబర్ 31, 2022. నోటిఫికేషన్ లో మోటార్ వెహికల్ మెకానిక్ 04,

Govt jobs without exam in Postal Department Jobs

Govt jobs without exam in Postal Department Jobs

మోటార్ వెహికల్ ఎలక్ట్రానిక్స్ 01 , కాపర్ అండ్ టిన్ స్మిత్ 01 , ఉఫాల్స్టార్ 01 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఎలాంటి దరఖాస్తు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ.100 రుసుము చెల్లించాలి. దరఖాస్తు దారుడి వయస్సు 18 నుండి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వేషన్ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఇదే సమయంలో మోటార్ వెహికల్ మెకానిక్ పోస్టు లకి అప్లై చేసే అభ్యర్థులకు లైట్, హెవీ మోటార్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. వెహికల్ మోటార్ మెకానిజంపై పరిజ్ఞానం ఉండాలి.

 

sekhar

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది