Health Tips : జామ పండ్లే కాదండోయ్.. జామ ఆకులు ఆరోగ్యానికే మేలే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Health Tips : జామ పండ్లే కాదండోయ్.. జామ ఆకులు ఆరోగ్యానికే మేలే..!

 Authored By pavan | The Telugu News | Updated on :21 February 2022,1:30 pm

Health Tips : జామ పండ్లంటే ఇష్టపడి వాళ్లు తినని వాళ్లుండరు అంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే జామ పండ్లు తియ్యగా, అంతి రుచిగా ఉంటాయి. కేవలం రుచి మాత్రమే కాదు.. వీటి వల్ల శరీరంలో రక్తం కూడా పెరుగుతుంది. అయితే ఆరోగ్యానికి ఇంత మేలు చేసే జామ పండ్ల గురించి మన అందరికీ తెలుసు. కానీ జామ ఆకుల వల్ల కలిగే మేలు గురించి మాత్ర ఎవరికీ తెలియదు. అయితే జామ ఆకులను నానబెట్టి లేదా నీళ్లలో మరగబెట్టి తాగితే ఎంత మేలు జరుగుతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.మన ఇంటి పెరట్లో ఉండే జామ కాయలు, పండ్లే కాక.. జామ ఆకులు కూడా ఎంతో ఆరోగ్యాన్ని అందిస్తాయి.ఇంట్లో ఉండే 3 లేదా 4 జామ ఆకులను తీసుకొని వాటిని శుభ్రంగా కడగాలి.

అనంతరం వాటిని ఒక పాత్రలో వేసి మంచి నీళ్లు పోయాలి. దానిని 15 నిమిషాల పాటు మంచిగా మరిగించాలి. తర్వాత ఆ నీటిని వడకట్టి… గోరు వెచ్చగా ఉండగానే తాగేయాలి. అలాగే తాగాలనిపించని వాళ్లు అందులో కొద్దిగా నిమ్మకాయ రసం, తేనె కలుపుకోవచ్చు. ఇలా ప్రతి రోజు ఉదయం తాగితే అనేక ప్రయోజనాలను పొందవచ్చు. జామ ఆకుల్లో విటామిన్ సి, లైకోపీన్, యాంటి ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి.అంతే కాదండోయ్ జామ ఆకులు వేసి మరిగించిన నీటిని తాగటం వల్ల సీజన్ వ్యాధులు దరిచేరవు. అలాగే చర్మ సమస్యలు కూడా తగ్గుతాయి. ఇంకా జుట్టు సమస్యలకు కూడా ఈ జామ ఆకుల రసం చెక్ పెడుతుంది.

guava leaves water very healthy for people

guava leaves water very healthy for people

జామ కాయ జ్యూస్ లివర్ కి మంటి టానిక్ లా పనిచేస్తుందట. అందుకే లివర్ సమస్యలు ఉన్నవాళ్లు ఈ జ్యూస్ ని ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. అంతే కాదు జామ ఆకులను నేరుగా తినడం వల్ల పంటి సమస్యలు దూరం అవుతాయంట. చిగుళ్ల నొప్పితో పాటు నోటి పూత తగ్గుతుంది. వ్యాధి నిరోదక శక్తి పెరుగుతుది. అయితే ముఖ్యంగా జలుబు, దగ్గు, వంటి సీజనల్ వ్యాధులు వెంటనే తగ్గిపోతాయి. ఆకుల్లో ఫైబర్ శాతం ఎక్కువగా ఉండటం వల్ల అజీర్ణ సమస్యలూ తగ్గుతాయి. అయితే శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ ను దూరం చేసి.. మనల్ని ఆరోగ్య కరంగా ఉంచడంలో జామ కాయ, జామ ఆకుల పాత్ర ఎంతగానో ఉంటుంది. అందుకే జామ కాయలు, పండ్లతో పాటు అప్పుడప్పుడూ జామ ఆకులను కూడా తినండి.

pavan

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది