Hardik Pandya : అందుకే హార్ధిక్ కి కెప్టెన్సీ ఇవ్వలే.. అజిత్ అగర్కర్ సంచలన వ్యాఖ్యలు..!
ప్రధానాంశాలు:
Hardhik Pandya : అందుకే హార్ధిక్ కి కెప్టెన్సీ ఇవ్వలే.. అజిత్ అగర్కర్ సంచలన వ్యాఖ్యలు..!
Hardik Pandya : టీ20 వరల్డ్ కప్ అందుకున్న క్రికెట్ టీం ఇండియా వరుస టోర్నీలకు సిద్ధమవుతుంది. రీసెంట్ గా జట్టులో ఉన్న యువ ఆటగాళ్లంతా కూడా జింబాబ్వే వెళ్లి ఐదు టీ 20 ల సీరీస్ ఆడి కప్ తీసుకొచ్చారు. ఐపిఎల్ లో సామర్ధ్యం చూపించిన యువ ఆటగాళ్లందరికీ జింబాబ్వే కి వెళ్లారు. ఇక ఈ నెల 27 నుంచి శ్రీలంకతో టీ20, వన్ డే సీరీస్ ఆడబోతుంది టీం ఇండియా. ఐతే సెలక్టర్లు ఇంకా కొత్త కోచ్ గా ఎంపికైన గౌతం గంభీర్ టీ 20 కెప్టెన్ గా సూర్య కుమార్ యాదవ్ ని ఎంపిక చేశారు. శ్రీలంక పర్యటనకు వెళ్తున్న టీం ఇండియా స్క్వాడ్ లో హార్ధిక్ పాండ్యాకు స్థానం కల్పించారు కానీ సూర్య కుమార్ యాదవ్ ని కెప్టెన్ గా ఎంపిక చేశారు. టీ20 కెప్టెన్ గా సూర్యకుమార్ యాదవ్ ప్రమోట్ అయ్యాడు. ఐతే హార్ధిక్ పాండ్యా ఫిట్ నెస్ సంసయల వల్లే అతన్ని కాకుండా సూర్య కుమార్ యాదవ్ కి కెప్టెన్సీ ఇచ్చినట్టు చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ చెప్పారు. హార్ధిక్ పాండ్యా ఫిట్ నెస్ సమస్య వల్ల అతను కెప్టెన్ గా చేయలేడని అజిత్ అగార్కర్ అన్నారు.
Hardik Pandya మొన్నటిదాకా వైస్ కెప్టెన్ ఇప్పుడు అది కూడా..
శ్రీలంక పర్యటనకు టీ20 జట్టు ప్రకటించినప్పుడు హార్ధిక్ పాండ్యానే కెప్టెన్ గా చేస్తారని అనుకున్నారు. కానీ అతని ప్లేస్ ని సూర్య కుమార్ యాదవ్ దక్కించుకున్నాడు. మొన్నటిదాకా టీ20 లలో వైస్ కెప్టెన్ గా ఉన్న హార్ధిక్ కెప్టెన్ గా ప్రమోట్ అవుతాడని అనుకుంటే అలా జరగలేదు. కేవలం హార్ధిక్ ఫిట్ నెస్ లోపం వల్లే కెప్టెన్ గా అనర్హత చేశారు.

Hardik Pandya : అందుకే హార్ధిక్ కి కెప్టెన్సీ ఇవ్వలే.. అజిత్ అగర్కర్ సంచలన వ్యాఖ్యలు..!
ఇక మరోపక్క సూర్య కుమార్ యాదవ్ అన్ని ఫార్మాట్ లో అద్భుతమైన ఆట తీరుని ప్రదర్శిస్తున్నాడు. అందుకే అతన్ని కెప్టెన్ గా ఎంపిక చేశారని తెలుస్తుంది. హార్ధిక్ ఆల్రౌండర్ ప్రతిభ జట్టుకి ఉపయోగపడుతున్నా కెప్టెన్ గా మాత్రం అతని ఫిట్ నెస్ సరిపోదని తేల్చారు సెలక్షన్ కమిటీ. దీంతో హార్ధిక్ కేవలం జట్టులో ఒక ఆటగాడిలానే శ్రీలంక పర్యటనలో పాల్గొననున్నాడు.