Health Benefits : డిటాక్స్ – డ్రింక్స్ తో కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు… అది ఎలాగంటే…
Health Benefits : కిడ్నీలు మన శరీరంలో ప్రధాన పాత్రను పోషిస్తాయి. ఇవి శరీరంలోని వ్యర్థ పదార్థాలను బయటకు పంపిస్తాయి. రక్తాన్ని శుద్ధి చేస్తాయి. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. కాబట్టి కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మంచి ఆహారం, తగినంత నీరు త్రాగాలి. దీని ద్వారా మాత్రమే కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. నీరు ఎక్కువగా త్రాగితే మూత్రపిండాలు దెబ్బతినకుండా ఉంటాయి అని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే వాటిని డిటాక్స్ చేయడం చాలా అవసరం. అటువంటి సమయంలో మీ ఆహారంలో కొన్ని పానీయాలను తీసుకోవచ్చు. కిడ్నీలను డీటాక్స్ చేసే పానీయాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. దానిమ్మ పండులో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. కాబట్టి ఇది కిడ్నీలో రాళ్లను తొలగించడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు రాళ్లు ఏర్పడకుండా అడ్డుకుంటాయి. అందుకే ప్రతిరోజు తాజా దానిమ్మ రసాన్ని తీసుకోవడం మంచిది.
అలాగే బీట్రూట్ కిడ్నీలను ఎంతో ఆరోగ్యకరంగా ఉంచుతుంది. బీట్రూట్ రసంలో బీటైన్ ఉంటుంది. ఇది చాలా ఉపయోగకరమైన ఫైటో కెమికల్. ఇందులో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి. అటువంటి పరిస్థితుల్లో రోజు బీట్రూట్ రసం తీసుకుంటే కిడ్నీలు డిటాక్స్ చేయడంతో పాటు కిడ్నీలలో రాళ్లు ఏర్పడే ప్రమాదం కూడా తక్కువగా ఉంటుంది. ఆపిల్ సైడర్ వెనిగర్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు సిట్రిక్ యాసిడ్ కిడ్నీలో రాళ్ళను కరిగించడంతోపాటు టాక్సీను తొలగిస్తాయి. దీని సహాయంతో డిటాక్స్ డ్రింక్ రెడీ చేయవచ్చు. దీనికోసం ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్ ను కలిపి ప్రతి రోజు త్రాగాలి. ఇలా చేయడం వలన కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి.