health benefits of dates telugu health tips
Dates : డేట్స్ అదేనండి.. ఖర్జూరాలు.. ఖర్జూర పండ్లు. వీటిని ఇష్టపడని వాళ్లు ఎవరైనా ఉంటారా అసలు. ఖర్జూరాలను చూస్తేనే నోరు ఊరుతుంది. ఎండు ఖర్జూరాలు అయినా.. పచ్చి ఖర్జూరాలు అయినా ఒక్కటి నోట్లో వేసుకుంటే చాలు.. ఆహా.. ఎంత మాధుర్యం. వాటిని చూడగానే తీసుకొని తినేయడమే. అంత ఇష్టంగా తింటారు ఖర్జూరాలను. అవి రుచికి ఎంతో తియ్యగా ఉంటాయి. ఖర్జూరాలను పిల్లలు కూడా ఎంతో ఇష్టంతో తింటారు. ఖర్జూరాలు తినడానికి మాత్రమే రుచిగా ఉంటాయి అని అనుకుంటారు చాలామంది కానీ.. ఖర్జూరాలను తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అసలు.. ఖర్జూల వల్ల ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని తెలిస్తే.. ఇన్ని పోషకాలు ఉన్నాయని తెలిస్తే.. మీరు అస్సలు ఆగరు. వెంటనే మార్కెట్ కు వెళ్లి కొనుక్కొని తినేస్తారు.
health benefits of dates telugu health tips
శరీరానికి కావాల్సిన దాదాపు అన్ని రకాల పోషకాలు ఒక్క ఖర్జూరలోనే ఉంటాయి. అందుకే.. ఖర్జూరాను తింటే ఎన్నో పోషకాలు శరీరానికి అందుతాయి. ఖర్జూర పండ్లలో ఎన్ని విటమిన్స్, ఎన్ని మినరల్స్ ఉంటాయో తెలుసా? ఖర్జూర పండ్లలో పొటాషియం, మెగ్నీషియం, పాస్ఫరస్, కాల్షియంన, ఐరన్, కాపర్, మాంగనీస్ లాంటి ఎన్నో మినరల్స్ ఉంటాయి. ఖర్జూరాలు ఎందుకు తియ్యగా ఉంటాయంటే.. ఇందులో ఫ్రక్టోజ్ ఉంటుంది. అందుకే.. ఖర్జూరాలు తియ్యగా ఉంటాయి. నీరసం వచ్చిన వాళ్లు, అలసట చెందిన వాళ్లు కొన్ని ఖర్జూర పండ్లను తింటే వెంటనే శక్తి వస్తుంది.
ఖర్జూర పండ్లలో ఉండే యాంటి యాక్సిడెంట్ల వల్ల.. క్యాన్సర్ రాదు. క్యాన్సర్ కణాలను ఖర్జూర పండ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చంపేస్తాయి. అలాగే.. గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. గుండె జబ్బులతో బాధపడేవాళ్లు.. ఖర్జూర పండ్లను.. రాత్రి పూట నానబెట్టి.. మరుసటి రోజు ఉదయం ఖర్జూరాలను మెత్తగా చేసుకొని తింటే.. గుండె పది కాలాల పాటు పదిలంగా ఉంటుంది.
జీర్ణ వ్యవస్థ మెరుగు పడాలన్నా… కంటి చూపు సమస్యలు తగ్గాలన్నా… రోగ నిరోధక శక్తి పెరగాలన్నా.. శరీరంలోకి వైరస్ రాకుండా ఉండాలన్నా.. ఎముకలు గట్టిగా మారాలన్నా.. రక్తం పెరగాలన్నా.. ఇలా అన్నింటికీ ఒకటే ఆహారం.. అదే ఖర్జూర పండు. చూశారు కదా.. ఒక్క ఖర్జూర పండులో ఎన్ని పోషకాలు ఉన్నాయో. క్రమం తప్పకుండా ఖర్జూర పండ్లను తినండి. ఆరోగ్యంగా ఉండండి. ఆరోగ్య సమస్యలను తరిమికొట్టండి.
Anitha : ఆంధ్రప్రదేశ్ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటనపై…
Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తాజాగా మరోసారి దర్శకుడు రాజ్ నిడిమోరుతో కలిసి కనిపించడం ప్రస్తుతం సోషల్…
Buddha Venkanna : తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు బుద్ధా వెంకన్న వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు…
Chamala Kiran Kumar Reddy : తెలంగాణలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసు విషయంలో సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పు…
3 Jobs AI : కృత్రిమ మేధస్సు (AI) విస్తృతంగా ప్రవేశించడంతో భారతీయ ఉద్యోగ రంగంలో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి.…
Kingdom : యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘కింగ్‌డమ్’ జూలై 31న భారీ…
Linguda Vegetable : ప్రకృతి ఇచ్చే ప్రతి ఒక్క కూరగాయ అయినా పనులైన ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. అందులో ఆకుపచ్చని…
Supreme Court : తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై సుప్రీంకోర్టు నేడు కీలక తీర్పును వెలువరించింది. ఈ…
This website uses cookies.