Dates : ఖర్జూరాలను తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే.. వద్దన్నా కొనుక్కొని తినేస్తారు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Dates : ఖర్జూరాలను తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే.. వద్దన్నా కొనుక్కొని తినేస్తారు..!

 Authored By jagadesh | The Telugu News | Updated on :26 May 2021,8:30 am

Dates : డేట్స్ అదేనండి.. ఖర్జూరాలు.. ఖర్జూర పండ్లు. వీటిని ఇష్టపడని వాళ్లు ఎవరైనా ఉంటారా అసలు. ఖర్జూరాలను చూస్తేనే నోరు ఊరుతుంది. ఎండు ఖర్జూరాలు అయినా.. పచ్చి ఖర్జూరాలు అయినా ఒక్కటి నోట్లో వేసుకుంటే చాలు.. ఆహా.. ఎంత మాధుర్యం. వాటిని చూడగానే తీసుకొని తినేయడమే. అంత ఇష్టంగా తింటారు ఖర్జూరాలను. అవి రుచికి ఎంతో తియ్యగా ఉంటాయి. ఖర్జూరాలను పిల్లలు కూడా ఎంతో ఇష్టంతో తింటారు. ఖర్జూరాలు తినడానికి మాత్రమే రుచిగా ఉంటాయి అని అనుకుంటారు చాలామంది కానీ.. ఖర్జూరాలను తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అసలు.. ఖర్జూల వల్ల ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని తెలిస్తే.. ఇన్ని పోషకాలు ఉన్నాయని తెలిస్తే.. మీరు అస్సలు ఆగరు. వెంటనే మార్కెట్ కు వెళ్లి కొనుక్కొని తినేస్తారు.

health benefits of dates telugu health tips

health benefits of dates telugu health tips

శరీరానికి కావాల్సిన దాదాపు అన్ని రకాల పోషకాలు ఒక్క ఖర్జూరలోనే ఉంటాయి. అందుకే.. ఖర్జూరాను తింటే ఎన్నో పోషకాలు శరీరానికి అందుతాయి. ఖర్జూర పండ్లలో ఎన్ని విటమిన్స్, ఎన్ని మినరల్స్ ఉంటాయో తెలుసా? ఖర్జూర పండ్లలో పొటాషియం, మెగ్నీషియం, పాస్ఫరస్, కాల్షియంన, ఐరన్, కాపర్, మాంగనీస్ లాంటి ఎన్నో మినరల్స్ ఉంటాయి. ఖర్జూరాలు ఎందుకు తియ్యగా ఉంటాయంటే.. ఇందులో ఫ్రక్టోజ్ ఉంటుంది. అందుకే.. ఖర్జూరాలు తియ్యగా ఉంటాయి. నీరసం వచ్చిన వాళ్లు, అలసట చెందిన వాళ్లు కొన్ని ఖర్జూర పండ్లను తింటే వెంటనే శక్తి వస్తుంది.

Dates : గుండె జబ్బులు, క్యాన్సర్ రాకుండా ఉండాలంటే ఖర్జూరాను క్రమం తప్పకుండా తినాల్సిందే

ఖర్జూర పండ్లలో ఉండే యాంటి యాక్సిడెంట్ల వల్ల.. క్యాన్సర్ రాదు. క్యాన్సర్ కణాలను ఖర్జూర పండ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చంపేస్తాయి. అలాగే.. గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. గుండె జబ్బులతో బాధపడేవాళ్లు.. ఖర్జూర పండ్లను.. రాత్రి పూట నానబెట్టి.. మరుసటి రోజు ఉదయం ఖర్జూరాలను మెత్తగా చేసుకొని తింటే.. గుండె పది కాలాల పాటు పదిలంగా ఉంటుంది.

జీర్ణ వ్యవస్థ మెరుగు పడాలన్నా… కంటి చూపు సమస్యలు తగ్గాలన్నా… రోగ నిరోధక శక్తి పెరగాలన్నా.. శరీరంలోకి వైరస్ రాకుండా ఉండాలన్నా.. ఎముకలు గట్టిగా మారాలన్నా.. రక్తం పెరగాలన్నా.. ఇలా అన్నింటికీ ఒకటే ఆహారం.. అదే ఖర్జూర పండు. చూశారు కదా.. ఒక్క ఖర్జూర పండులో ఎన్ని పోషకాలు ఉన్నాయో. క్రమం తప్పకుండా ఖర్జూర పండ్లను తినండి. ఆరోగ్యంగా ఉండండి. ఆరోగ్య సమస్యలను తరిమికొట్టండి.

ఇది కూడా చ‌ద‌వండి ==> మీకు గుండె జ‌బ్బులు రాకుండా ఉండాలంటే ప్ర‌తి రోజూ మూడు అర‌టి పండ్లు ఖ‌చ్చితంగా తినండి….!

ఇది కూడా చ‌ద‌వండి ==> ఉప్పు నీటిని గోంతులో పోసుకొని పుక్కిలించ‌డం వ‌ల‌న క‌లిగే ప్ర‌యోజ‌నాలు ?

ఇది కూడా చ‌ద‌వండి ==> Ayurvedic Tea : ఈ ఆయుర్వేద టీని తాగారో.. మీ శరీరంలో వచ్చే మార్పులు చూసి అస్సలు వదలరు..!

ఇది కూడా చ‌ద‌వండి ==> Dates : ఖర్జూరాలను తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే.. వద్దన్నా కొనుక్కొని తినేస్తారు..!

Advertisement
WhatsApp Group Join Now

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది