Ayurvedic Tea : ఈ ఆయుర్వేద టీని తాగారో.. మీ శరీరంలో వచ్చే మార్పులు చూసి అస్సలు వదలరు..!
Ayurvedic Tea : ఆయుర్వేద చాయ్ లేదా హెర్బల్ చాయ్ దీన్నే అగ్ని టీ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే.. మన శరీరంలో ఉండే జఠరాగ్ని సరిగ్గా పని చేయకపోతే ఎన్నో సమస్యలు వస్తాయి. అది కూడా ఒక రకంగా అగ్ని లాంటిదే. అందుకే దాన్ని జఠరాగ్ని అని పిలుస్తున్నాం. అది జీర్ణక్రియ వ్యవస్థను మెరుగుపరచడంతో పాటు.. మెటబాలిజం రేటును పెంచుతుంది. అయితే.. జఠరాగ్ని సరిగ్గా లేకపోతేనే సమస్య. అప్పుడు జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలు రావడం, తిన్నది సరిగ్గా అరగకపోవడం లాంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి.
అందుకే.. జీర్ణ సంబంధ సమస్యలు ఏవి ఉన్నా.. వాటికి వెంటనే చెక్ పెట్టేందుకు అగ్ని టీని తాగితే చాలు. దాన్నే మనం హెర్బల్ టీ.. లేదా ఆయుర్వేద టీ అంటాం. దీని వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. పూర్తిగా మన వంటింట్లో ఉండే పదార్థాలతోనే ఈ టీని తయారు చేస్తారు. ఈ టీని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల.. కేవలం జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలు తగ్గడం మాత్రమే కాదు.. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దగ్గు, జలుబు లాంటి ఎన్నో సమస్యలకు చెక్ పెట్టొచ్చు.
Ayurvedic Tea : అగ్ని టీని ఎలా తయారు చేసుకోవాలి?
అగ్ని టీ లేదా ఆయుర్వేద టీని తయారు చేసే విధానం ఏంటంటే.. దాని కోసం మనకు కావాల్సిన పదార్థాలు.. కొన్ని నీళ్లు, కొంచెం కారం, మెత్తగా తురిమిన అల్లం, కొంచెం రాక్ సాల్ట్, నిమ్మరసం, తేనె. ఈ పదార్థాలు ఎవ్వరి వంటింట్లో అయినా ఉండేవే. కానీ.. వీటిలో ఉండే ఆయుర్వేద రహస్యాలు మనకు తెలియవు. అందుకే మన వంటిల్లే మనకు ఆసుపత్రి. అక్కడే మనకు అన్ని రకాల రోగాలకు సంబంధించిన పదార్థాలు దొరుకుతాయి.
ముందుగా ఒక గిన్నె తీసుకొని.. అందులో కొన్ని నీళ్లు పోసి కాసేపు మరగబెట్టండి. ఆ తర్వాత దాంట్లో చిటికెడు కారం, అల్లం, రాక్ సాల్ట్ వేయండి. బాగా మరిగించండి. కొంత సేపటి తర్వాత ఆ నీటిని వడకట్టండి. ఆ తర్వాత అందులో ఇంత నిమ్మరసం, తేనె కలుపుకొని తాగేయండి. అంతే.. రోజుకు ఒక్కసారి ఈ టీని తాగితే చాలు. ఈ టీలో ఉండే అద్భుత గుణాలు ఏంటో మీకే తెలుస్తాయి.
ఇది కూడా చదవండి ==> పసుపు గ్రీన్ టీని నిత్యం తీసుకుంటే శరీరంలో జరిగే మార్పులు తెలిస్తే అస్సలు వదలరు..!
ఇది కూడా చదవండి ==> రోజూ ఒక గ్లాస్ తిప్పతీగ జ్యూస్ తాగితే కలిగే అద్భుతమైన ప్రయోజనాలు..!
ఇది కూడా చదవండి ==> శరీరంలో వంద రోగాలు ఉన్నా.. ఈ ఒక్క డైట్ పాటిస్తే మీ రోగాలన్నీ మటాష్..!
ఇది కూడా చదవండి ==> రావి చెట్టు ఆరోగ్య ప్రయోజనాలు.. ఏటువంటి వ్యాధులను నయం చేస్తాయో తెలుసా..?