Healthy Diet | జామపండుతో ఆరోగ్య రక్షణ .. సరైన సమయంలో తింటే అద్భుత ప్రయోజనాలు
Healthy Diet | అధిక పోషక విలువలు, తక్కువ ధర, సులభంగా లభ్యతతో జామపండు ప్రతి ఇంట్లో ఉండే సాధారణ పండు. కానీ దీనిలో దాగిన ఆరోగ్య రహస్యాలు తెలుసుకుంటే ప్రతి రోజు తినకుండా ఉండలేరు. జామపండులో విటమిన్ C, ఫైబర్, లైకోపిన్, పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటంతో ఇది నిజంగా ఆరోగ్యానికి ఒక బంగారు బంపర్ అని చెప్పొచ్చు.
#image_title
జామపండును ఎప్పుడు తినాలి?
ఉదయం బ్రేక్‌ఫాస్ట్ తర్వాత లేదా మధ్యాహ్నం ముందు (10 AM – 12 PM) జామపండు తినడం ఉత్తమం. ఈ సమయంలో శరీరం పండులోని పోషకాల్ని త్వరగా గ్రహించగలదు. ఫైబర్, సహజ చక్కెరలు శరీరానికి తక్షణ శక్తిని ఇస్తాయి. దీనితో పాటు జీర్ణవ్యవస్థకు సహాయపడుతుంది.
బరువు తగ్గాలంటే జామ చాలు!
జామపండు తక్కువ కాలరీలతో అధిక ఫైబర్‌ను కలిగి ఉండటం వల్ల చాలా సేపు కడుపు నిండిన ఫీలింగ్ ఇస్తుంది. భోజనానికి ముందు ఒక జామ తినడం వల్ల ఆకలి నియంత్రించవచ్చు.
షుగర్ ఉన్నవారికీ బాసట
మధుమేహ వ్యాధిగ్రస్తులు మధ్యాహ్నం చిరుతిండి సమయంలో జామపండును తీసుకుంటే, రక్తంలో షుగర్ లెవల్స్‌ను సమతుల్యం చేసుకోవచ్చు. ఇందులో ఉన్న ఫైబర్ శరీరంలో గ్లూకోజ్ శోషణ వేగాన్ని తగ్గించి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.
దంతాలు, చిగుళ్లకు రక్షణ
జామపండు తొక్కతో తినడం వల్ల దంతాల ఆరోగ్యం మెరుగవుతుంది. ఇందులో ఉండే యాంటీబాక్టీరియల్ లక్షణాలు నోటి లోపల బాక్టీరియా పెరగకుండా నిరోధిస్తాయి.