Tomato Price : టమాటా మండిస్తున్నారు.. ఉల్లి తినకుండానే కన్నీళ్లు.. బాబోయ్ అనిపిస్తున్న కూరగాయల రేట్లు..!
ప్రధానాంశాలు:
Tomato Price : టమాటా మండిస్తున్నారు.. ఉల్లి తినకుండానే కన్నీళ్లు.. బాబోయ్ అనిపిస్తున్న కూరగాయల రేట్లు..!
Tomato price : మార్కెట్ లో మళ్లీ కూరగాయల ధరలు మండిపోతున్నాయి. ముఖ్యంగా అన్ని కూరల్లో వేసే టమాటా ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. టమాటా ధరలతో పాటు దానికి కాంబినేషన్ గా ఉల్లిపాయల ధరలు కూడా మండుతున్నాయి. టమాటా ధరలు ఒక నెల క్రితం కేజీ 100 నుంచి 150 కి పైన కూడా పలికిన సందర్భాలు ఉన్నాయి. ఐతే మధ్యలో స్టాక్ ఎక్కువ ఉండటం వల్ల మళ్లీ రేటు తగ్గి కిలో 50 నుంచి 80 దాకా అమ్మారు. కానీ మళ్లీ టమాటా కొరత ఉండటం వల్ల మళీ రేటు ఒక్కసారిగా పెంచారు.టమాటా ధరలు పెరగడానికి ప్రధాన కారణం వర్షాలని కూడా తెలుస్తుంది. వర్షాల వల్ల దిగుబడి తక్కువ అవ్వడం తో దాని వల్ల రేటు పెంచడం జరుగుతుంది. ఒకప్పుడు కూరగాయల్లో అతి తక్కువ రేటు ఉన్న టమాటా ఇప్పుడు భారీ ధర పలుకుతూ ప్రజలకు టెన్షన్ పెంచేస్తున్నాయి. టమాటా ధరలు పెరగడం వల్ల ప్రజలు వాటిని తీసుకోవడం కూడా తగ్గించారు.
Tomato Price టమాటా తో పాటు ఉల్లిపాయలు ఎందుకు పెరిగాయంటే..
టమాటాతో పాటుగా ఉల్లిపాయలు కూడా రేటు దంచి కొడుతున్నాయి. టమాటా రేటు పెరిగిందని ఓ పక్క ప్రజలు బాధపడుతుంటే ఉల్లి ధరలు కూడ షాక్ ఇస్తున్నాయి. ఉల్లిపాయలు ధరలు కూడా ఇప్పుడు కిలో 80 రూపాయల దాకా పలుకుతున్నాయి. నిన్న మొన్నటిదాకా కిలో ఉల్లిపాయలు 40,50 ఉండగా టమాటాలతో పాటు అవి కూడా భారీ గా రేట్లు పెరుగుతున్నాయి.
ఐతే టమాటా రేటు పెరగడం వల్ల మిగతా కూరగాయల కోసం ప్రజలు చూస్తున్నారు. అన్ని కూరల్లో వేసుకునే టమాటా రేటు పెరగడం వల్ల దాన్ని తగ్గించి మిగతా కూరగాయల మీద ఆధారపడుతున్నారు ప్రజలు. ఐతే టమాట ని తీసుకోకుండా ఉందామని అనుకున్నా పెరిగిన ఉల్లిపాయల ధర వల్ల కూడా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరి వీటి ధరలు ఎప్పుడు సాధారణ ప్రజలకు అందుబాటులోకి వస్తాయన్నది చూడాలి.