Health Tips | ఆరోగ్యానికి అమృత సమానమైన వెలగపండు.. ముఖ్య ప్రయోజనాలు ఇవే!
Health Tips | వెలగపండు ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు అందించే పండు. ఇందులో ఉండే పీచు పదార్థం వల్ల పేగుల కదలికలు మెరుగవ్వడమే కాక, మలబద్ధకం, డయేరియా వంటి సమస్యలు రాకుండా అడ్డుకుంటుంది. అంతేకాకుండా, ఈ పండు రోగనిరోధక శక్తిని పెంపొందించి, శరీరాన్ని ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుతుంది.
#image_title
మంచి ఉపయోగాలు..
వెలగపండులో విటమిన్ C, బీటా కెరోటిన్, థయామిన్ , రైబోఫ్లావిన్ లాంటివి సహా అనేక ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఇందులో అధికంగా ఉండే పీచు పదార్థం జీర్ణక్రియను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. తరచూ అజీర్ణం లేదా మలబద్ధకంతో బాధపడేవారికి వెలగపండు ఒక ప్రకృతి వైద్యంలా పనిచేస్తుంది. ఇది పేగుల కదలికలను సవ్యంగా ఉంచి, వాంతులు, డయేరియా వంటి సమస్యలు తలెత్తకుండా చేస్తుంది.
వెలగపండులోని విటమిన్ C శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్. ఇది శరీరాన్ని వైరస్‌లు, బ్యాక్టీరియా వలన కలిగే వ్యాధుల నుంచి రక్షిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచి ఆరోగ్యంగా ఉంచుతుంది. వెలగపండులో కోలెస్ట్రాల్ మరియు సోడియం తక్కువగా ఉంటాయి. పొటాషియం అధికంగా ఉండడం వలన రక్తపోటును నియంత్రించి, హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. వెలగపండును నేరుగా తినవచ్చు లేదంటే
పచ్చడిగా తయారు చేసుకోవచ్చు