Health Tips | పిస్తా పప్పుని రోజూ తినొచ్చా.. అవి తినడం వలన ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో తెలుసా?
Health Tips | పిస్తా పప్పులు కేవలం రుచికరమైన వంటకాలలో చేర్చే ఒక సాధారణ పదార్థమే కాదు… ఇవి మన శరీరానికి అత్యవసరమైన పోషకాలు అందిస్తాయి. పిస్తాలో ఉండే న్యూట్రియంట్లు రోగనిరోధక శక్తిని పెంపొందించి, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి
పిస్తాలో ఉన్న ముఖ్య పోషకాలు – వాటి లాభాలు
రాగి : శరీరంలో యాంటీబాడీల ఉత్పత్తికి కీలకం, రోగనిరోధక శక్తికి తోడ్పాటు.
విటమిన్ B6: శరీరం ఇమ్యూన్ సెల్స్‌ను ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది.
సెలీనియం: శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్. కణాలను ఆక్సిడేటివ్ దెబ్బల నుంచి రక్షిస్తుంది.
జింక్ : వైరల్ ఇన్‌ఫెక్షన్లను నివారించడంలో, శరీర రక్షణ వ్యవస్థను మద్దతించడంలో కీలక పాత్ర.

#image_title
పిస్తా ప్రయోజనాలు
ఆకలిని నియంత్రించడంలో సహాయపడుతుంది
కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది – శుక్లాలు, మచ్చల క్షీణత నివారణ
రోగనిరోధక కణాల పనితీరును మెరుగుపరుస్తుంది
శరీరంలోని వాపును తగ్గిస్తుంది
ఫైబర్ సమృద్ధిగా ఉండటంతో జీర్ణ వ్యవస్థకు మేలు చేస్తుంది
పేగులోని మంచి బ్యాక్టీరియాను పెంచి, శ్లేష్మ పొర రక్షణను బలోపేతం చేస్తుంది
పిస్తాను స్నాక్స్‌గా.. రోజూ మోతాదుకు తగ్గట్లు నేరుగా తినవచ్చు . కట్ చేసిన పిస్తాను సలాడ్‌లపై చల్లడం ద్వారా రుచి, ఆరోగ్యం రెండూ మెరుగవుతాయి . ఐస్‌క్రీమ్, పుడ్డింగ్, కేక్స్‌లో టాపింగ్‌లా వాడితే అదిరిపోయే రుచి ఉంటుంది. మితంగా, పరిమితంగా తీసుకుంటే పిస్తా ఒక సూపర్‌ఫుడ్‌గా నిలుస్తుంది!