Diabetes : షుగర్ పేషెంట్లు ఎక్కువగా కొబ్బరి తింటే… ఎటువంటి ఆరోగ్య సమస్యలు వస్తాయో తెలుసా..?
Diabetes : షుగర్ వ్యాధి ఉన్నవాళ్లకు చాలా పరిమితులు ఉంటాయి. వాళ్లు అది తినకూడదు. ఇది తినకూడదు అని డాక్టర్లు సూచిస్తుంటారు. ఎక్కువగా తీపి పదార్థాలు తినకూడదంటారు. అన్నం ఎక్కువగా తినకూడదంటారు. మద్యం తాగకూడదు. నాన్ వెజ్ ఎక్కువగా తినకూడదు. ఇలా పలు రకాల పరిమితులు వాళ్లకు ఉంటాయి. ఎందుకంటే.. షుగర్ ఉన్నవాళ్లు.. క్రమం తప్పకుండా.. వాళ్ల షుగర్ లేవల్స్ ను కంట్రోల్ లో ఉంచుకోవాల్సి ఉంటుంది. లేదంటే చాలా కష్టం.
అయితే.. షుగర్ వ్యాధి ఉన్నవాళ్లు చాలామంది కొబ్బరిని తింటుంటారు. వాళ్లే కాదు.. ఎవ్వరికైనా కొబ్బరి అంటే చాలా ఇష్టం. కొబ్బరిని చూస్తేనే నోరూరుతుంది. కొందరైతే దాన్ని అలాగే.. పచ్చిదాన్నే తినేస్తారు. ఇంకొందరు పచ్చి కొబ్బరితో వంటకాలు కూడా చేస్తారు. పచ్చి కొబ్బరి చట్నీ కూడా చేస్తారు. అయితే.. కొబ్బరిని ఎక్కువగా తీసుకుంటే గుండె సమస్యలు వస్తాయని.. కొబ్బరి వల్ల ఎక్కువగా కొవ్వు వస్తుందని చాలామంది అంటుంటారు. కానీ.. అది నిజం కాదు. అది అపోహ మాత్రమే.
Diabetes : షుగర్ ఉన్నవాళ్లు కూడా కొబ్బరిని నిరభ్యంతరంగా తినొచ్చు
మీకు షుగర్ ఉన్నా కూడా ఏమాత్రం భయపడకుండా కొబ్బరిని తీసుకోవచ్చు. ఎందుకంటే.. కొబ్బరిలో చాలా పోషకాలు ఉంటాయి. అలాగే.. కొబ్బరిలో ఉండే ఔషధ గుణాలు.. షుగర్ లేవల్స్ ను కంట్రోల్ లో ఉంచుతాయి. కొబ్బరిలో ఎక్కువగా పైబర్ ఉంటుంది. అది షుగర్ లేవల్స్ ను కంట్రోల్ లో ఉంచడానికి ఉపయోగపడుతుంది. అలాగే.. కొబ్బరిని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎటువంటి ఆరోగ్య సమస్యలు రావు.. పైగా గుండె జబ్బులు తగ్గుతాయి.
కొబ్బరిలో అధికంగా మాంగనీస్ ఉంటుంది. అది ఎముకల ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే.. ఇందులో ఉండే రాగి, ఐరన్.. ఎర్రకర్తకణాల వృద్ధికి సాయపడుతాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు.. శరీరంలోని చాలా రోగాలను నయం చేస్తాయి. డయాబెటిస్ ఉన్నవాళ్లు అయితే.. కొబ్బరిని నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. దీంట్లో కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉండి.. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. గోధుమలు, అన్నం, జొన్నలు లాంటి వాటికన్నా కూడా కొబ్బరిలో కార్బోహైడ్రేట్స్ చాలా తక్కువగా ఉంటాయి. అలాగే.. కొబ్బరిని తీసుకోగానే శక్తి వస్తుంది. నీరసంగా ఉన్నవాళ్లు వెంటనే యాక్టివ్ అయిపోతారు. దీంట్లో ఉండే ఔషధ గుణాలు.. బ్యాక్టీరియాతో పోరాడి వాటిని నాశనం చేస్తాయి.
ఇది కూడా చదవండి ==> ఎన్ని నీళ్లు తాగినా యూరిన్ సమస్య రాకుండా ఉండాలంటే ఈ చిట్కాను ఫాలో అవండి..!
ఇది కూడా చదవండి ==> ఈ పువ్వు రసాన్ని ఒక్కసారి వాడితే చాలు.. కంటిచూపు మెరుగు అవుతుంది
ఇది కూడా చదవండి ==> సీతాఫలం ఆకులతో డయాబెటిక్ చెక్.. ఇంకా ఏటువంటి అనారోగ్యలు నయం అవుతాయో తెలుసా..?
ఇది కూడా చదవండి ==> గర్భం దాల్చినట్టు ఎలా తెలుసుకోవాలి.. గర్భం వచ్చేముందు కనిపించే ఐదు లక్షణాలు ఇవే..!