Health Tips : ఎక్కువ సేపు సిస్టమ్ చూస్తున్నారా.. మీ కళ్లు పాడవకుండా ఉండేందుకు ఇలా చేయండి…
Health Tips : కంప్యూటర్.. నేటి రోజుల్లో ఇది సర్వసాధారణమయిపోయింది. కంప్యూటర్ లేనిదే రోజు గడవకుండా అయిపోయింది. ఇంకా సాఫ్ట్ వేర్ వర్క్ చేస్తున్న వాళ్లయితే రోజులో ఎక్కువ సేపు కంప్యూటర్ స్ర్కీన్ నే చూస్తూ ఉండాలి. కేవలం సాఫ్ట్ వేర్ వారికనే కాకుండా చాలా మందికి కంప్యూటర్ చూడడం తప్పడం లేదు. అలా ఎక్కువ సేపు కంప్యూటర్ స్క్రీన్ ను చూడడం వలన మన కళ్ల మీద స్ట్రెస్ పడే అవకాశం ఉంది. కావున మన కళ్ల మీద పడ్డ స్ట్రెస్ ను తగ్గించుకోవడం కోసం కింది సింపుల్ చిట్కాలను పాటించడం చాలా మంచిది.
నేటి రోజుల్లో ఎక్కువ మందికి వర్క్ ఫ్రం హోం అవకాశం ఉంటుంది కావున ఈ చిట్కాలను పాటిస్తే కళ్లను సైడ్ ఎఫెక్స్ట్ రాకుండా కాపాడుకోవచ్చు..అదే పనిగా కంప్యూటర్ స్ర్కీన్ ను చూడడం వలన మన కళ్లు అలసిపోతాయి. కావున కొద్ది సేపు బ్రేక్ ఇవ్వడం మంచిది. వర్క్ ఫ్రం హోం ఆప్షన్ ఉన్నవాళ్లు వర్క్ లో ఉంటూనే మధ్యాహ్న భోజనం పూర్తి చేసుకోవాలి. తర్వాత లంచ్ టైం గంట సేపు కాస్త రిలాక్స్ గా పడుకోవాలి. ఇలా చేయడం వలన మన కళ్లు రిఫ్రెష్ అవుతాయి. కావున మన కళ్లకు తిరిగి ఎనర్జీ గేన్ అవుతుంది.
System Effect on Eyes: స్ట్రెస్ రాకుండా ఉండేందుకు ఇలా చేయండి…
ఆఫీస్ లో వర్క్ చేసే వాళ్లు కూడా కళ్లకు తగినంత సేపు విశ్రాంతినివ్వాలి. తిన్న తర్వాత ఒక అరగంట సేపు కళ్లు మూసుకుని రిలాక్స్ గా ఉండాలి. ఇలా చేయడం వలన మన కళ్ల మీద పడ్డ స్ట్రెస్ తగ్గిపోతుంది. మళ్లీ మన కళ్లు ఎనర్జీని అందుకుని చాలా ఉత్సాహంగా అవుతాయి. రోజుకు ప్రతి ఒక్కరూ ఎనిమిది గంటల సేపు రిలాక్స్ గా పడుకోవాలి. అలాంటపుడే కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి.