Health Tips : కేవలం 3సార్లు తాగితే చాలు.. నడుము నొప్పి, కాళ్లు చేతులకు తిమ్మిర్లు శాశ్వతంగా మాయం… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Health Tips : కేవలం 3సార్లు తాగితే చాలు.. నడుము నొప్పి, కాళ్లు చేతులకు తిమ్మిర్లు శాశ్వతంగా మాయం…

 Authored By aruna | The Telugu News | Updated on :27 August 2023,7:00 am

Health Tips  : అదేంటో ఆరోగ్యాన్ని ఇచ్చే ఆహారాన్ని అంతగా ఎవరు ఇష్టపడరు. మన ఆరోగ్యాన్ని చెడగొట్టే ఆహారాన్ని ఇష్టంగా తింటాం.. అందుకే మనం ఎంత తిన్నగాని ఏదో నీరసం వెంటాడుతూనే ఉంటుంది. ఎక్కువగా పని చేయలేం, ఎక్కువగా నడవలేం, వయస్సుతో సంబంధం లేకుండా మోకాళ్ళ నొప్పులని కాళ్ళ నొప్పులని కీళ్ల నొప్పులు, నరాలు బలహీనత, తిమ్మిర్లు రావడం ఇటువంటి సమస్యలు అన్నీ కూడా సరైన ఆహారం తీసుకోకపోవడం వల్లే వస్తాయి. మరి ఇన్ని సమస్యలకి ఎలాంటి ఆహారం తీసుకోవాలి అని సందేహిస్తున్నారా.. సింపుల్ ఒకే ఒక డ్రింక్ తో ఇప్పుడు చెప్పిన సమస్యలు అన్నింటికి చెక్ పెట్టే అద్భుతమైన హోమ్ రెమిడీ చెప్పబోతున్నాను.

ఇది మీరు టేస్ట్ చేశారంటే రోజు వద్దన్నా సరే తాగుతూనే ఉంటారు. ఈ డ్రింక్ అంత టేస్టీగా ఉంటుంది. ఈ టెస్ట్ డ్రింక్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా గసగసాలు చూడడానికి చాలా చిన్నగానే ఉంటాయి. కానీ ప్రయోజనాలు అయితే చాలా ఎక్కువ. గసగసాలలో కాల్షియం, మాంగనీస్, ఒమేగా త్రి, ప్రోటీన్లు వంటి పోషకాలు ఉన్నాయి. మరో ఇంగ్రిడియంట్ సోంపు. దీంతోపాటు ఎండు కొబ్బరి. ముఖ్యంగా విటమిన్స్ మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి కీళ్ల నొప్పులకు చక్కగా పనిచేస్తుంది. అలాగే ఎండు కొబ్బరిని బెల్లంతో కలిపి తింటే రక్తహీనత సమస్య కూడా తగ్గుతుంది. పటిక బెల్లం శరీరానికి చలువ చేస్తుంది. అలాగే మన ఒంట్లో శక్తిని మెరుగుపరుస్తుంది.

Health Tips OF pain in the back legs and arms

Health Tips OF pain in the back legs and arms

కఫం గొంతు సంబంధిత సమస్యలకు పట్టిక బెల్లం చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఈ హెల్తీ డ్రింక్ ఎలా చేసుకోవాలో చూద్దాం. స్టవ్ పై ఒక గిన్నెను పెట్టి దానిలో ఒక స్పూన్ నెయ్యి వేసి వెంటనే గసగసాలు ఒక స్పూన్ వేసి వెంటనే వేయించండి. ఎందుకంటే గసగసాలు తొందరగా మాడిపోతాయి. కాబట్టి ఇలా గసగసాలు దోరగా వేగగానే ఆవు పాలు ఒక గ్లాస్ వరకు తీసుకుని ఆవుపాలు లేకపోతే మామూలు పాలైన వేసుకోవచ్చు. ఈ పాలు గసగసాలు బాగా కలిపి ఇందులో ఎండు కొబ్బరి ముక్కలుగా లేదంటే వెడల్పు ఉండే ఒక చిన్న ముక్కలుగా చేసుకుని పాలలో వేసేయండి. ఇప్పుడు ఇందులో సోంపు గింజలు ఒక స్పూన్ వేసుకోండి. ఇప్పుడు వీటన్నింటినీ బాగా కలిపి ఐదు నిమిషాల పాటు మరిగించండి. ఐదు నిమిషాలు అయిపోయాక రుచి కోసం పటిక వేసుకోండి.

ఇలా వేసిన తర్వాత ఒక పొంగు వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి కొంచెం చల్లగా అయిన తర్వాత ఒక గ్లాసులోకి వడకట్టుకోవాలి.ఇప్పుడు దీన్ని ఎలా తాగాలో చూద్దాం. రాత్రి భోజనం తర్వాత ఈ పాలని తాగాలి. ఈ డ్రింక్ తాగడానికి ముందు ఈ పాలలో మనం ఎండు కొబ్బరి వేసుకున్న కదా ఆ ఎండు కొబ్బరిని కొంచెం కొంచెంగా కొరికి నమిలి తింటూ ఈ పాలను కూడా తాగుతూ ఉండాలి. కొబ్బరి తినడం మాత్రం మర్చిపోకండి. మంచి నిద్రతో పాటు అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి..

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది