Diabetes : షుగర్ ఉన్నవాళ్లు ఏం తినాలి? ఏం తినకూడదు? నిజంగానే అన్నం తినకూడదా?
Diabetes : ప్రస్తుతం మానవాళి ఎదర్కొంటున్న అది పెద్ద సమస్య షుగర్. దాన్నే డయాబెటిస్ అని అంటున్నాం. చెక్కర వ్యాధి అన్నా కూడా అదే. ఈ వ్యాధి వస్తే.. జీవితాంతం ట్యాబ్లెట్లు వేసుకొని బతకాల్సిందే. నిజానికి షుగర్ లో రెండు రకాలు ఉంటాయి. ఒకటి టైప్ 1 డయాబెటిస్, రెండోది టైప్ 2 డయాబెటిస్. ఈరెండింటి వల్ల కూడా మనిషికి ప్రమాదమే.
ఏ రకమైన డయాబెటిస్ వచ్చినా సరే… ఖచ్చితంగా షుగర్ ఉన్నవాళ్లు కొన్ని రకాల అలవాట్లను మార్చుకోవాలి. జీవన విధానంలోనూ ఎన్నో మార్పులు రావాల్సిన అవసరం ఉంది. ఇదివరకు ఉన్న లైఫ్ స్టయిల్ వేరు… ఇప్పుడు ఉన్న లైఫ్ స్టయిల్ వేరు.
షుగర్ ఉన్నవాళ్లు అది తినాలి… ఇది తినాలి… అది తినకూడదు.. ఇది తినకూడదు… అని చెబుతుంటారు. ముఖ్యంగా అన్నం విషయంలో షుగర్ ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. రోజుకు మూడు పూటల అన్నం అస్సలు తినకూడదు. కుదిరితే.. అన్నం పూర్తిగా మానేయడం మేలు.
షుగర్ ఉన్నవాళ్లు తమ రక్తంలో… చక్కెర స్థాయిలను ఎప్పుడూ నియంత్రణలో ఉంచుకోవాలి. అప్పుడే షుగర్ ఉన్నా కూడా ఆరోగ్యంగా ఉండగలుగుతారు. ఒకవేళ చక్కెర స్థాయి పడిపోయినా.. ఎక్కువైనా నాడీ వ్యవస్థ పని చేయదు. దీంతో వాళ్లు మూర్చపోయే ప్రమాదం ఉంది.
Diabetes : ఎటువంటి ఆహారం తీసుకోవాలి?
షుగర్ ఉన్నవాళ్లు గుర్తుంచుకోవాల్సిన ఒకే ఒక విషయం…. పిండిపదార్థాలు తక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవడం. వీటినే కార్బోహైడ్రేట్స్ అంటారు. అన్నంలో ఇవి ఎక్కువగా ఉంటాయి. అందుకే… అన్నాన్ని తినకూడదు అని డాక్టర్లు చెబుతుంటారు.
అన్నం ఎక్కువ తింటే… ఎక్కువ పిండి పదార్థాలు శరీరంలోకి చేరడంతో… చక్కెర స్థాయి ఒక్కసారిగా పెరుగుతుంది. దీంతో షుగర్ పెరిగే ప్రమాదం ఉంటుంది. కాబట్టి.. పిండిపదార్థాలు తక్కువగా ఉండేలా ఆహారంలో చూసుకోవాలి. అలాగే గ్లూకోజ్ కూడా శరీరానికి కావాల్సినంతే అందేలా చూసుకోవాలి.
కార్బోహైడ్రేట్స్, గ్లూకోజ్ ను సమంగా మెయిన్ టెన్ చేసుకుంటే… మిగితా ఆహారాలు ఏవైనా తినొచ్చు. ఎక్కువ తీపి వస్తువులను మాత్రం దూరంగా పెట్టాలి.